
ఖాన్ ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు?
విజయవాడ: తమను సంప్రదించకుండా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను టీడీపీలో చేర్చుకోవడంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన నియోజకవర్గంలో టీడీపీ ఫిరాయింపు రాజకీయాలు చేయడాన్ని తప్పుబడుతున్నారు.
జలీల్ ఖాన్ ను పార్టీలో ఎలా చేర్చుకున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే జలీల్ ఖాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ టికెట్ పై పోటీ చేయాలన్నారు. జలీల్ ఖాన్ కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.