వర్మగా షఫీ ఒదిగిపోయాడు! | Na Cinema Naa Ishtam movie reday for releases | Sakshi
Sakshi News home page

వర్మగా షఫీ ఒదిగిపోయాడు!

Published Mon, Sep 1 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

వర్మగా షఫీ ఒదిగిపోయాడు!

వర్మగా షఫీ ఒదిగిపోయాడు!

 షఫీ కీలక పాత్రలో వి. విజయకుమార్ రాజు నిర్మించిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. ‘నా సినిమా నా ఇష్టం’ అనేది ఉపశీర్షిక. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్రవిశేషాలను దర్శకుడు తెలియజేస్తూ -‘‘రక్తపాతం, హింస ప్రధానాంశాలుగా చేసుకుని సినిమాలు రూపొందించే ఓ దర్శకుడు ఎలాంటి ఫలితం అనుభవించాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. శ్యామ్‌గోపాల్ వర్మ పాత్రలో షఫీ అద్భుతంగా ఒదిగిపోయాడు’’ అన్నారు. తొలి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు. నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ చెప్పారు. ఈ చిత్రకథ సహజత్వానికి దగ్గరగా ఉంటుందని షఫీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement