తల్లీపిల్లల అదృశ్యం | Mother and child disappear | Sakshi
Sakshi News home page

తల్లీపిల్లల అదృశ్యం

Published Fri, Nov 21 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

నాగరత్నం

నాగరత్నం

 మందస: శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని పొత్తంగికి చెందిన మర్ల నాగరత్నం తమ ఇద్దరు కుమార్తెలు జ్యోత్స్న(6), స్పందన(2)లతో కలసి ఈ నెల 17వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ ఆమె భర్త సోమేశ్వరరావు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు పిల్లలను తీసుకుని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి నుంచి వెళ్లి సంతతోటలో ఆటో ఎక్కి మందస వచ్చినట్లు స్థానికులు ద్వారా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

19వ తేదీ వరకు బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఆశ్రయించినట్టు తెలిపారు. హెచ్‌సీ జె.జగన్నాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement