తల్లీపిల్లల అదృశ్యం
మందస: శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని పొత్తంగికి చెందిన మర్ల నాగరత్నం తమ ఇద్దరు కుమార్తెలు జ్యోత్స్న(6), స్పందన(2)లతో కలసి ఈ నెల 17వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ ఆమె భర్త సోమేశ్వరరావు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు పిల్లలను తీసుకుని సెల్ఫోన్లో మాట్లాడుతూ ఇంటి నుంచి వెళ్లి సంతతోటలో ఆటో ఎక్కి మందస వచ్చినట్లు స్థానికులు ద్వారా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
19వ తేదీ వరకు బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఆశ్రయించినట్టు తెలిపారు. హెచ్సీ జె.జగన్నాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.