
చనిపోయాడనుకున్న వ్యక్తి.. తిరిగొచ్చాడు!
చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తు లు అవాక్కయ్యారు.
దహన సంస్కారాల తర్వాత వెలుగులోకి..
గట్టు: చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తు లు అవాక్కయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం ఆలూరులో జరి గింది. గ్రామానికి చెందిన బోయ వెంకటన్న 15 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో గట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, గత నెల 27న కృష్ణానదిలో 40 ఏళ్ల వయస్సున వ్యక్తి మృతదేహాన్ని గద్వాల రూరల్ పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని బోయ వెం కటన్నదిగా భావించి గ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించారు.
కానీ, 15 రోజులుగా హైదరాబాద్‌లో తిరిగిన వెంకటన్న శుక్రవారం గద్వాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చా డు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇదిలాఉండగా, కృష్ణానదిలో లభించిన మృతదేహం మల్దకల్ మండలం ఉలిగెపల్లికి చెందిన కుర్వ గోవిందు(40)దని తేలింది. అతడు కూడా 15 రోజుల క్రితం అదృశ్యమై కృష్ణానదిలో శవమయ్యాడని అతని కుటుంబ సభ్యులు గద్వాల డీఎస్సీ బాలకోటిని ఆశ్రయించారు. దీంతో ఈ నెల 2న శవాన్ని వెలికితీసి గోవిందు కుటుంబ సభ్యులకు అప్పగించారు.