పాలిటెక్నిక్ విద్యార్థి అదృశ్యం
Published Sun, Nov 20 2016 3:56 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
మిర్యాలగూడ అర్బన్ : కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన విద్యార్థి కనిపించకుండా పోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల మండలం కమలానగర్‌కు చెందిన పోరెడ్డి సైదిరెడ్డి, రజితారెడ్డి కుమారుడు రవీందర్‌రెడ్డి(19) నల్లగొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.
కాగా ఈనెల 16వ తేదీన తన తల్లి రజి తారెడ్డితో కలిసి తన స్వగ్రామం కమలానగర్ నుంచి మిర్యాలగూడకు వచ్చాడు. వాసవీభవన్ రోడ్డులో షాపింగ్ ము గించుకొని తల్లిని నేరేడుచర్ల బస్సు ఎక్కించాడు. తాను నల్లగొండకు వెళ్తానని చెప్పాడు. మరుసటి రోజు కళాశాల నుంచి ఫోన్ చేసిన లెక్చరర్లు రవీందర్‌రెడ్డి కాలేజీకి రాలేదని తల్లిదండ్రుకు తెలిపారు.
దీంతో కంగారుపడి తమ బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఈ నెల 18 వ తేదీ సాయంత్రం రవీందర్‌రెడ్డి ఫేస్‌బుక్ నుంచి తన తల్లికి ఐ మిస్ యూ మమ్మీ..అంటూ మెసేజ్ పంపాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పో లీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement