ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండాపోయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండాపోయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్ ప్రాంతంలో నివాసముండే నిలేష్ కుమారుడు శంకర్(17) స్థానికంగా 10 వతరగతి చదువుతున్నాడు. అతడు ఈ నెల 3వ తేదిన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.