విద్యార్థి అదృశ్యమైన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
విద్యార్థి అదృశ్యమైన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.....ఆర్.కె.హెచ్. కాలనీ వీధి నంబర్ 5లో నివాసముండే గోపయ్య కుమారుడు సంతోష్ (17) విద్యార్ధి. మంగళవారం కళాశాలకు వెలుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సంతోష్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా ఆచూకి లభించకపోవడంతో బుధవారం తండ్రి గోపయ్య నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.