హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య గొడవలు ఎక్కువైపోయాయి. దానికి తోడు వారికి కొందరు పోలీసులు కూడా సహకరించడంతో వివాదాలు తీవ్రస్థాయికి దారి తీస్తున్నాయి. ఈ వివాదాలు, వేధింపులతో విసిగిపోయి నగరంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యమైయ్యాడు. ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి)ను ఆశ్రయించారు.
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వెంకట్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని తోటి వ్యాపారులు చారి, గణేష్ రెడ్డి వేధిస్తున్నారు. వనస్థలిపురం సీఐ వారికి తోడై వెంకట్ రెడ్డిని ఎక్కువగా వేధించడం మొదలుపెట్టారు. దాంతో వెంకట్‌రెడ్డి సూసైడ్‌నోట్ రాసి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు హెచ్‌ఆర్సికి ఫిర్యాదు చేశారు.
రియల్‌ఎస్టేట్ వ్యాపారి వెంకట్‌రెడ్డి అదృశ్యం
Published Sat, Jul 5 2014 2:57 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement