
మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం
గచ్చిబౌలి: మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం పోచమ్మ బస్తీకి చెందిన ప్రియాంక గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 27న ఆఫీసుకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. భర్త శ్రవణ్‌కుమార్ మంగళవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.