శాన్ ఫ్రాన్సిస్కో: ఒకప్పుడు వెబ్ బ్రౌజర్‌కు పర్యాయపదంగా నిల్చిన మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఐఈ) పూర్తిగా కనుమరుగు కానుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నెటిజన్లు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో తమ అనుభవాలను ట్విటర్‌లో (సానుకూలంగాను, ప్రతికూలంగాను) పంచుకున్నారు.
అయితే, ఇది ఎకాయెకిన చోటు చేసుకున్న పరిణామం కాదు. 2022 జూన్ 15 నుంచి ఐఈని నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. 2015 లో ప్రవేశపెట్టిన కొత్త ఎడ్జ్ బ్రౌజర్‌ను వినియోగించుకోవచ్చని సూచించింది. ‘ఐఈతో పోలిస్తే ఎడ్జ్ మరింత వేగవంతమైన, సురక్షితమైన, ఆధునిక బ్రౌజర్‘ అని 2021 మేలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎంటర్‌ప్రైజ్ జనరల్ మేనేజర్ షాన్ లిండర్‌సే ఒక బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment