Internet Explorer
-
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు గుడ్‌బై
శాన్ ఫ్రాన్సిస్కో: ఒకప్పుడు వెబ్ బ్రౌజర్‌కు పర్యాయపదంగా నిల్చిన మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఐఈ) పూర్తిగా కనుమరుగు కానుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నెటిజన్లు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో తమ అనుభవాలను ట్విటర్లో (సానుకూలంగాను, ప్రతికూలంగాను) పంచుకున్నారు. అయితే, ఇది ఎకాయెకిన చోటు చేసుకున్న పరిణామం కాదు. 2022 జూన్ 15 నుంచి ఐఈని నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. 2015 లో ప్రవేశపెట్టిన కొత్త ఎడ్జ్ బ్రౌజర్‌ను వినియోగించుకోవచ్చని సూచించింది. ‘ఐఈతో పోలిస్తే ఎడ్జ్ మరింత వేగవంతమైన, సురక్షితమైన, ఆధునిక బ్రౌజర్‘ అని 2021 మేలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎంటర్ప్రైజ్ జనరల్ మేనేజర్ షాన్ లిండర్సే ఒక బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. -
ప్చ్.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది
ఇంటర్నెట్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది. దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఎక్స్‌ప్లోరర్ సేవల్ని ఆపేస్తోంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. జూన్ 15న ఈ యాప్ సేవల్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం. ►ఇంటర్నెట్ వాడకం వచ్చిన కొత్తలో బ్రౌజర్ల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ టైంలో.. 1995 ఆగష్టులో విండోస్ 95 ప్యాకేజీ ద్వారా మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. దానిని ఫ్రీగా అందించింది. ► తాజాగా.. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయకుండా పోతుంది అని ఒక ప్రకటన వెలువడింది. ► 2003లో ఇంటర్నెట్ బ్రౌజర్లలో 95 శాతం వాడకం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్దే. కానీ.. ► ఆ తర్వాతి కాలంలో ఇతర బ్రౌజర్ల పోటీతత్వం నడుమ ఆ పొజిషన్‌ను కాపాడుకోలేకపోయింది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. ► బ్రౌజర్ మార్కెట్లో స్మూత్ పర్ఫార్మెన్స్, ఇంటర్నెట్ స్పీడ్ ఇలా రకరకాల కారణాలతో పోటీతత్వంలోనూ ఎక్స్‌ప్లోరర్ వెనుకబడిపోయింది. పైగా వేగంగా అప్డేట్ లేకుండా సాదాసీదా బ్రౌజర్‌గా మిగిలిపోయింది. ► వీటికి తోడు హ్యాకింగ్ ముప్పుతో ఈ బ్రౌజర్‌ను ఉపయోగించేవాళ్లు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో.. డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్‌లలో జస్ట్ ఒక డీఫాల్ట్ బ్రౌజర్‌గా మిగిలిపోయింది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్. ► 2016 నుంచి మైక్రోసాప్ట్ కొత్త బ్రౌజర్ ఫీచర్‌ను డెవలప్మెంట్ చేయడం ఆపేసింది. ఈ టెక్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించుకోవడం అదే మొదటిసారి కూడా. ► ఎక్స్‌ఫ్లోరర్ స్థానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటోంది. ఇది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ కంటే సురక్షితమైన బ్రౌజింగ్ అని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామర్ మేనేజర్ సీన్ లిండర్సే చెప్తున్నారు. ► ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ ‘నైంటీస్, 2000వ’ దశకంలో ఎంతో మంది ఇంటర్నెట్ యూజర్లతో అనుబంధం పెనవేసుకుపోయింది. అందుకే విషయం తెలియగానే.. చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. Internet Explorer is shutting down in three days. I haven't used IE in a decades but it was the browser I had used for the majority if my childhood. Whether you loved or hated Internet Explorer, it'll be the end if an era 💛 — Caesár (@CnaVD) June 11, 2022 ProductHunt: After 27 years of service, Microsoft is going to retire Internet Explorer for good on June 15th. pic.twitter.com/EEpvrx34FQ — ProductGram (@ProductGrams) June 12, 2022 -
మైక్రోసాఫ్ట్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నిలిచిపోనుంది. ఈ రోజు(నవంబర్ 30) నుండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో తన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్‌కి సపోర్ట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఒక వేల మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని ఉపయోగించాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో టీమ్స్ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో వినియోగదారులందరని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను ఉపయోగించుకునేలా చేయాలని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. (చదవండి: మోటో జీ 5జీ లాంచ్ నేడే) 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉండనుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను మైక్రో సాఫ్ట్ కొత్తగా తీసుకొచ్చింది. క్రోమ్ బ్రౌజర్ మాదిరిగానే ఇది కూడా సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 సంవత్సరాల క్రితం, 1995 ఆగస్టులో విడుదలైంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. 2003 ఏడాదిలో 95 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి వాటితో పోటీ నేపథ్యంలో ఈ కొత్త వెబ్ బ్రౌజర్ ని తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. -
మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ప్లోరర్ శకం ముగిసినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు చెందిన ప్రతిష్టాత్మక వెబ్ బ్రౌజర్ "ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్" సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్ బ్రౌజర్ ఇక కనుమరుగు కానుంది. వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించింది. 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని ఈ ఏడాది నవంబర్ 30 తర్వాత నుంచి తమ టీమ్ కూడా అందుబాటులో ఉండదని ఇటీవల వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవలు భవిష్యత్తులో దీనిని సపోర్ట్ చేయవని పేర్కొంది. అలాగే మార్చి 9, 2021 తరువాతనుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటుందనితెలిపింది. మైక్రోసాఫ్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ మాదిరిగానే ఉండే కొత్త బ్రౌజర్ వేగంగా, సమర్ధవంతంగా పనిచేస్తుంది. జనవరిలో ఇది లాంచ్ అయినప్పటినుంచి లక్షలాది మంది యూజర్లు తమ బ్రౌజర్లను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌కు అప్‌గ్రేడ్ చేసుకున్నారు. కాగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 ఏళ్ల క్రితం, ఆగస్టు,1995లో విడుదలైంది. 2003లో 95 శాతం యూజర్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గా నిలిచింది. అయితే ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఈ పోటీలో దూసుకు రావడంతో క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. -
మైక్రోసాఫ్ట్ ఆ బ్రౌజర్లను మూసేస్తుంది!
-
మైక్రోసాఫ్ట్ ఆ బ్రౌజర్లను మూసేస్తుంది!
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఓల్డ్ వెర్షన్ బ్రౌజర్లను మూసివేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 8, 9, 10 వెర్షన్లకు టెక్నికల్, సెక్యురిటీ సపోర్ట్‌ను నిలిపివేస్తూ మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఈ బ్రౌజర్లను ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. అయితే మారుతున్న ఆధునిక వెబ్ అవసరాలకు అనుగుణంగా మైక్రోసాఫ్ట్ రూపొందించిన కొత్త వెర్షన్లు.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లను ప్రోత్సహించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకమీదట పాత వెర్షన్లను ఉపయోగించే యూజర్లకు ఎటువంటి టెక్నికల్, సెక్యురిటీ అప్డేట్స్ను సంస్థ అందించదు. దీంతో యూజర్లు హ్యాకర్ల బారిన పడే అవకాశాలు పెరుగడమే కాకుండా బ్రౌజింగ్ ప్రక్రియ కూడా సాఫీగా సాగదు. ఐఈ 8, 9, 10 వెర్షన్లను ఉపయోగించే యూజర్లు.. ఐఈ 11, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లతో అప్డేట్ కావాలని సంస్థ ప్రకటించింది. 2002లో ప్రపంచ మార్కెట్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వినియోగదారుల వాటా 85 శాతంగా ఉండేది. అయితే గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ వినియోగదారులు పెరుగుతుండటంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ల వినియోగదారుల వాటా గత సంవత్సరానికి 6.8 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 వెర్షన్లతో ప్రపంచమార్కెట్లో మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ల వినియోగదారుల సంఖ్య పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. -
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి హ్యాకింగ్ ముప్పు
వాషింగ్టన్: నెటిజన్లను ఇటీవలే హార్ట్‌బ్లీడ్ బగ్ బెంబేలెత్తించగా.. తాజాగా మరో ముప్పు తెరపైకి వచ్చింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్(ఐఈ) బ్రౌజర్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించినట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. వీటి వల్ల యూజర్ల కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడి, వాటిని తమ ఆధీనంలో తెచ్చుకునే అవకాశం ఉందని వివరించింది. ఇప్పటికే ఈ తరహా దాడులు కొంత మేర జరిగాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఐఈలోని 6 నుంచి 11 దాకా వెర్షన్లలో ఈ బగ్ ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. కస్టమర్ల అవసరాన్ని బట్టి.. ప్రతి నెలా సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు ఈ పరిష్కారాన్ని అందించే అంశాన్ని మైక్రోసాఫ్ట్ పరిశీలిస్తున్నట్లు ‘బీబీసీ న్యూస్’ తెలిపింది. మైక్రోసాఫ్ట్ నుంచి సపోర్ట్ నిల్చిపోయినప్పటికీ ఇప్పటికీ విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తున్న వారికి హ్యాకర్ల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భద్రతాపరమైన లోపాల కారణంగా ఎక్స్పీ ఓఎస్‌పై ఉపయోగించే ఐఈ తరచూ క్రాష్ కావొచ్చని సిమాంటెక్ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్రౌజర్ మార్కెట్లో ఐఈ వివిధ వెర్షన్ల వాటా 50% పైగా ఉంటోందని అంచనా. హ్యాకింగ్ ముప్పు ఇలా..: ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో లోపాలను తమకు అనుకూలంగా వాడుకునేందుకు.. హ్యాకర్లు అనుసరిస్తున్న విధానాలను మైక్రోసాఫ్ట్ వివరించింది. దీని ప్రకారం.. హ్యాకింగ్ కోసం హ్యాకర్లు ప్రత్యేక వెబ్సైటు ప్రారంభించి యూజర్లను ఆకర్షిస్తారు. ఈ మెయిల్ లేదా ఇన్స్టంట్ మెసెంజర్స్ ద్వారా సదరు వెబ్‌సైట్‌కి లింకులను పం పుతారు. అసలు విషయం తెలియక వాటిని క్లిక్ చేసే యూజర్ల కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడతారు.