Scientists Predict Tuvalu Disappear in the Next 50 to 100 Years - Sakshi
Sakshi News home page

ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!

Published Sun, Jul 23 2023 8:36 AM | Last Updated on Sun, Jul 23 2023 11:18 AM

Scientists Predict Tuvalu Disappear In The Next 50 To 100 Years - Sakshi

మరో యాభై ఏళ్లలో ఆ దేశం ఉనికిలో ఉండకపోవచ్చు. పూర్తిగా సముద్రంలో మునిగిపోవచ్చు. ఇప్పటికే ఆ దేశం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. ఆ దేశం ఏమిటి? ఎక్కడుంది అనుకుంటన్నారా? ఫిజీకి ఉత్తరాన వెయ్యి కిలోమీటర్ల దరంలో పసిఫిక్‌ సముద్రంలో ఉన్న ఈ న్న ద్వీపదేశం పేరు ‘తువాలు’. దీని విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు, జనాభా 11,900. ఈ దేశానికి ఒక విమానాశ్రయం ఉంది.

వారానికి మూడు విమానాలు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు జరుపుతాయి. విమానాల రాకపోకలు లేని సమయంలో పిల్లలు రన్‌వే మీద ఆటలాడుకుంటూ కనిపిస్తారు. ఈ దేశం పర్యాటకంలో అత్యంత వెనుకబడిన దేశంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది. తువాలును ఏటా సందర్శించే పర్యాటకులు సగటున 3,700 మంది మాత్రమే! ఈ దేశంలోని ప్రధాన ద్వీపంలో మనుషులు నివసిస్తుంటారు. ఈ దేశంలో భాగంగా నాలుగు పగడపు దీవులు కూడా ఉన్నాయి.

ఈ దేశంలో హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య కూడా తక్కువే! విత్రమైన ప్రదేశాలను చూడాలనుకునే ఉబలాటం గల కొద్దిమంది తప్ప వినోదయాత్రల కోసం పర్యటనలకు వెళ్లేవారెవరు ఈ దేశంవైపు చూడరు. ఈ దేశంలో ఏటీఎంలు ఉండవు. అందువల్ల డబ్బు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే! పర్యావరణ మార్పుల కారణంగా సముద్రజలాలు పెరుగుతూ వస్తుండటంతో ఈ దేశం మరో యాభయ్యేళ్లలోగా పూర్తిగా నీట మునిగిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ దేశం చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న దీవులు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయాయి.

(చదవండి: అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement