ఇద్దరి విద్యార్థినుల అదృశ్యం | Both of students Disappearance | Sakshi
Sakshi News home page

ఇద్దరి విద్యార్థినుల అదృశ్యం

Published Thu, Feb 12 2015 12:02 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM

ఇద్దరి విద్యార్థినుల అదృశ్యం - Sakshi

ఇద్దరి విద్యార్థినుల అదృశ్యం

దుబ్బాక : డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు అదృశ్యమైన బుధవారం ఫిర్యాదులు అందినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ చెప్పారు. మండల పరిధిలోని రామక్కపేట గ్రామానికి చెందిన మోత్కు దుర్గయ్య కుమార్తె నీలిమ(19) ఎస్‌వీవీ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7న కళాశాలకు ఇంటి నుంచి వెళ్లిన నీలిమ ఇంత వరకు ఇంటికి రాలేదు. నీలిమ కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే విధంగా మండల పరిధిలోని గోసాన్‌పల్లి గ్రామానికి చెందిన అక్క అంజిరెడ్డి కుమార్తె అక్క సంధ్య (17) ఎస్‌వీవీ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. జనవరి 17న కళాశాలకు ఇంటి నుంచి వెళ్లిన సంధ్య ఇంత వరకు ఇంటికి రాలేదు. బం ధువులు, స్నేహితల వద్ద సంధ్య కోసం ఆరా తీసినా ఫలి తం లేకుండా పోయింది. ఇరువురి విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విద్యార్థుల సమాచారం తెలిసిన వాళ్లు 94906 17063, 94906 17021, 94906 17009కు సమాచారాన్ని ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement