తన గురించి వెతకొద్దని కుటుంబ సభ్యులకు ఎస్సెమ్మెస్ పంపించి గృహిణి అదృశ్యమైంది కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో
మలేసియా టౌన్ షిప్: తన గురించి వెతకొద్దని కుటుంబ సభ్యులకు ఎస్సెమ్మెస్ పంపించి గృహిణి అదృశ్యమైంది కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. ఎస్‌ఐ మహేష్ గౌడ్ కథనం ప్రకారం... నిజాంపేట గ్రామంలోని మిలినియం హోమ్స్‌లో ఎస్.జందారావు, చందన ప్రతిమ దంపతులు (35) నివాసముంటున్నారు. జందారావు ప్రైవేట్ ఉద్యోగి కాగా, చందన ప్రతిమ గృహిణి. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం ప్రతిమ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో జందారావు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించడంతో పాటు బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన గురించి వెతక వద్దని చందన ప్రతిమ భర్తకు, సోదరుడికి సెల్ ద్వారా మెసేజ్ పంపించినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.