ఇద్దరు స్వైన్‌ఫ్లూ బాధితులు అదృశ్యం | Disappear two Swine flu victims | Sakshi
Sakshi News home page

ఇద్దరు స్వైన్‌ఫ్లూ బాధితులు అదృశ్యం

Published Tue, Dec 30 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

ఇద్దరు స్వైన్‌ఫ్లూ బాధితులు అదృశ్యం

ఇద్దరు స్వైన్‌ఫ్లూ బాధితులు అదృశ్యం

గాంధీలో ఒకరు..కార్పొరేట్ ఆస్పత్రిలో మరొకరు
వైద్యులకు చెప్పకుండానే వెళ్లిపోతున్న బాధితులు
ఆందోళనలో గ్రేటర్ వాసులు
పట్టించుకోని వైద్యులు

గాంధీ ఆస్పత్రి: నగరంలో స్వైన్ ఫ్లూ బాధితులు వరుసగా అదృశ్యమవుతున్నారు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాల్సిన బాధితులు కనీసం వైద్యులకు సమాచారం ఇవ్వకుండానే మాయమవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గాంధీ ఆస్పత్రిలో రెండున్నర నెలల్లోఐదుగురు అదృశ్యం కాగా... తాజాగా రాజమండ్రికి చెందిన వ్యకి(34) కనిపించకుండాపోయినట్లు తెలిసింది.

సకాలంలో వైద్యం అందక కొంతమంది బయటికి వెళ్లిపోతుంటే... పక్కనే ఉన్న ఏఎంసీ వార్డులో మరణాలను చూసి భయంతో మరికొందరు పారిపోతున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆరునెలల కాలంలో 16 స్వెన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా... వీరిలో ఐదుగురు అదృశ్యమయ్యారు. మరో నలుగురు మృతిచెందారు. మినిస్టర్స్ రోడ్డులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితుల్లో ఒకరు కనిపించకుండా పోవ డం చర్చనీయాంశమైంది.
 
మరింత మందికి విస్తరించే ప్రమాదం
గ్రేటర్ హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కేవలం నగరంలో నమోదైన కేసులే కాకుండా జిల్లాల్లో నమోదైన కేసులు సైతం ఇక్కడికే వస్తున్నాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో నల్లగుట్టకు చెందిన విశ్వతేజ(18 మాసాలు)తో పాటు రాజమండ్రికి చెందిన కాశీ(34), ఈసీఐఎల్‌కు చెందిన శశికళ (26) చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల పాటు ఇదే ఆస్పత్రిలో చికిత్ప పొందిన కాశీ ఈ నెల 28న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.

బేగంపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలోని ఇద్దరు బాధితుల్లో ఒకరు వ్యాధి నిర్ధారించినతర్వాత కనిపించకుండా పోయినట్లు తెలిసింది. స్వైన్‌ఫ్లూతో బాధ పడుతున్న వీరు జనసముహంలో సంచరిస్తే... మరింత మందికి వైరస్‌సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనిపించకుండా ఈ బాధితులను ఇప్పటి వరకు గుర్తించపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
 
కోలుకుంటున్న బాధితులు
ఇదిలా ఉంటే స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఆస్పత్రి ఐసోలేషన్, డిజాస్టర్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వార్డులో చికిత్స పొందుతున్న శశికళతో పాటు విశ్వతేజలు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement