చనిపోతానంటూ లేఖ రాసి.. | young woman disappear written suicide note | Sakshi
Sakshi News home page

చనిపోతానంటూ లేఖ రాసి..

Jan 2 2018 9:09 AM | Updated on Nov 6 2018 8:22 PM

young woman disappear written suicide note - Sakshi

బంజారాహిల్స్‌: ‘జీవితంపై విరక్తి చెందాను..బతకాలని లేదు.. చావడానికే వెళ్తున్నాను’... అంటూ ఓ యువతి లేఖరాసి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని వ్యాపారి రాజు కుమార్తె శ్రీలత(23) పీజీ పూర్తి చేసింది.

ఆదివారం ఉదయం స్నేహితు రాలి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. తల్లిదండ్రులు ఆమె గదిలో గాలించగా అద్దం కింద ఓ లేఖ కనిపించింది. అందులో తాను జీవితంపై విరక్తి చెందానని చనిపోవడానికే వెళుతున్నట్లు ఉండటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement