కాజీపేట: వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చదువుతున్న విద్యార్థి కనిపించకుండాపోయాడు. తండ్రి బస్కుల భాస్కర్‌రావు బుధవారం కాజీ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బస్కుల వేణుగోపాల్ నిట్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి వస్త్రవ్యా పారి. ఇటీవల వేణుగోపాల్ అనారోగ్యం పాల య్యాడు. వైద్యంతోపాటు తన చదువు ఖర్చులకు తండ్రి పడుతున్న కష్టాలను చూసి చలించాడు. దీపావళికి హైదరాబాద్‌లోని అన్నయ్య వద్దకు బయలుదేరాడు. మంగళవారం వేణుగోపాల్‌ను అతడి మిత్రుడు నిట్ ఎదుట ఆటో ఎక్కించాడు. ‘నా ల్యాప్‌టాప్ కింద ఒక ఉత్తరం ఉంది చదవమని’ చెప్పి వెళ్లిపోయాడు. హాస్టల్‌కు వచ్చి ఆ ఉత్తరం తీసి చదవగా.. ‘నేను కన్నవాళ్లకు భారం గా మారానని, అనారోగ్యంతో సరిగా చదువలేకపోతున్నాను.’ అని రాసి ఉంది.
దూర ప్రాంతానికి వెళ్లిపోతున్నట్లు, జీవితంలో బాగా రాణిం చిన తర్వాత వస్తానంటూ లేఖలో పేర్కొన్నాడు. మిత్రుడు వెంటనే కళాశాల యాజమాన్యంతోపాటు తల్లిదండ్రులకు ఉత్తరాన్ని అందించాడు. వేణుగోపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వేజంక్షన్‌లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా... రైలు ఎక్కి వెళ్లిపోయినట్లుగా కన్పించింది.
నిట్ విద్యార్థి అదృశ్యం
Published Thu, Oct 23 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM
Advertisement
Advertisement