ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్‌ఐ మజార్ మహ్మద్‌ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.... తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన బి.సుధాకర్‌రెడ్డి (30) ఈ నెల 22వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తెలిసిన వారి ఇండ్లలో, వివిధ ప్రాంతాల్లో ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. సుధాకర్‌రెడ్డి తమ్ముడు బి.వేణుగోపాల్ రెడ్డి కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.