ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యం
నాగిరెడ్డిపేట : ఎల్లారెడ్డి మండలంలోని అజామాబాద్‌కు చెందిన చింతకాయల నర్సవ్వ తన ఇద్దరు పిల్లలు గతనెల 31న మండలంలోని గోపాల్‌పేట నుంచి అదృశ్యమైనట్లు నాగిరెడ్డిపేట ఏఎస్సై కిష్టయ్య తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికలాన్‌కు చెందిన నర్సవ్వకు కొంతకాలం క్రితం ఎల్లారెడ్డి మండలం అజామాబాద్‌కు చెందిన చింతకాయల ఊశయ్యతో వివాహం జరిగింది. కాగా తనతల్లి ఆరోగ్యం బాగాలేదని ఆమెను చూడడానికి గతనెల 24న నర్సవ్వ తన కూతురు అలేఖ్య, కొడుకు సంతోష్‌తో కలిసి లింగంపల్లికలాన్‌కు వెళ్లింది. వారంరోజులపాటు అక్కడే ఉన్న నర్సవ్వ హైదరాబాద్‌లో పనిచేస్తున్న తన భర్త ఊశయ్య వద్దకు వెళ్తానని చెప్పడంతో ఆమె అన్నయ్య రొడ్డ చిన్నఅంజయ్య గతనెల 31న గోపాల్‌పేటలో నర్సవ్వతోపాటు ఆమె పిల్లలను హైదరాబాద్ బస్సు ఎక్కించాడు. కాగా నర్సవ్వ తనవద్దకు రాలేదని ఆమె భర్త చెప్పడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో నర్సవ్వ అన్నయ్య అంజయ్య ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.