నగలు, నగదుతో గృహిణి అదృశ్యం | house hold woman Disappears with money, arnaments in hyderabad | Sakshi
Sakshi News home page

నగలు, నగదుతో గృహిణి అదృశ్యం

Mar 11 2016 10:52 PM | Updated on Sep 3 2017 7:30 PM

ఇంట్లో ఉన్న నగలు, నగదుతో గృహిణి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

చిలకలగూడ : ఇంట్లో ఉన్న నగలు, నగదుతో గృహిణి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీకి చెందిన రాజు, మల్లిక (32)లు భార్యభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా సికింద్రాబాద్ వారాసిగూడలో ఉంటు పాలవ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం రాజు తన పిల్లలను స్కూలుకు దిగబెట్టేందుకు వెల్లగా, మల్లిక రెండు ఏటీఎం కార్డుల నుంచి రూ.80వేలు విత్‌డ్రా చేసి, ఆ సొమ్ముతోపాటు ఇంట్లోఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు,రూ.3 లక్షల నగదు తీసుకుని అదృశ్యమైంది.

పిల్లలను స్కూలుకు దిగబెట్టి ఇంటికి వచ్చిన రాజుకు భార్య మల్లిక కనిపించలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితంలేకపోయింది. ఇంట్లోని నగదు, నగలుతోపాటు తన భార్య కనిపించకపోవడంతో భర్త రాజు పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement