arnaments
-
సీసీ కెమెరా సాయంతో ఆభరణాల రికవరీ
గణపవరం (నిడమర్రు): ఆటోలో పోయిన బంగారు ఆభరణాలు సీసీ కెమెరా సాయంతో పోలీసులు రికవరీ చేశారు. గణపవరం సీఐ ఎన్.దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన కరక వెంకటలక్ష్మి అత్తిలిలో బంధువుల ఇంటికి వచ్చారు. ఈనెల 13న సాయంత్రం అత్తిలి నుంచి గణపవరం వచ్చేందుకు పిప్పర వరకూ ఓ ఆటో, పిప్పర నుంచి గణపవరం మరో మరో ఆటోలో ప్రయాణించారు. గణపవరం వచ్చాక ఆటోలో బ్యాగ్ మరిచిపోయినట్టు గుర్తించారు. బ్యాగ్‌లో 14 కాసుల వరకూ బంగారు ఆభరణాలు ఉండటంతో బంధువుల సాయంతో ఆమె తాడేపల్లిగూడెం, గణపవరం, పిప్పర, అత్తిలి ఆటోస్టాండ్ల వద్ద ఆరా తీసినా ప్రయోజనం లేదు. దీంతో 15వ తేదీన గణపవరం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. పిప్పరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా యానలపల్లికి చెందిన ఆటోడ్రై వర్ కె.రామచంద్రరావును విచారించగా బ్యాగ్ అతని వద్దే ఉనట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. శనివారం ఆటోడ్రై వర్ రామచంద్రరావును తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు. ఆభరణాలను కోర్టు ద్వారా బాధితురాలికి అందిస్తామన్నారు. దర్యాప్తునకు గపణపవరం ఎసై ్స డి.హరికష్ణ, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరావు, కానిస్టేబుళ్లు రాంబాబు, అక్బర్ సహకరించారు. ఫిర్యాదు విషయంలో శ్రద్ధ తీసుకుని సొమ్ము రికవరీకి కషి చేసిన కానిస్టేబుల్ రాంబాబును సీఐ ప్రత్యేకంగా అభినందించారు. -
బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి..
హైదరాబాద్ సిటీ: ఎస్ఆర్ నగర్లో బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారంతో ఉడాయించారు. సబీనా సుల్తానా అనే మహిళ దృష్టి మరల్చి 3.8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగలు, నగదుతో గృహిణి అదృశ్యం
చిలకలగూడ : ఇంట్లో ఉన్న నగలు, నగదుతో గృహిణి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీకి చెందిన రాజు, మల్లిక (32)లు భార్యభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా సికింద్రాబాద్ వారాసిగూడలో ఉంటు పాలవ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం రాజు తన పిల్లలను స్కూలుకు దిగబెట్టేందుకు వెల్లగా, మల్లిక రెండు ఏటీఎం కార్డుల నుంచి రూ.80వేలు విత్‌డ్రా చేసి, ఆ సొమ్ముతోపాటు ఇంట్లోఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు,రూ.3 లక్షల నగదు తీసుకుని అదృశ్యమైంది. పిల్లలను స్కూలుకు దిగబెట్టి ఇంటికి వచ్చిన రాజుకు భార్య మల్లిక కనిపించలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితంలేకపోయింది. ఇంట్లోని నగదు, నగలుతోపాటు తన భార్య కనిపించకపోవడంతో భర్త రాజు పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
సొంతింటికే కన్నం వేశాడు
యాకుత్‌పురా: సొంత ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో ఓ వ్యక్తిని రెయిన్‌బజార్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం....యాకుత్‌పురా చున్నీకీ బట్టి ప్రాంతానికి చెందిన మహ్మద్ గౌస్ మూడో కుమారుడు మహ్మద్ ఖాజా (30) తన ఇంట్లోని 15 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. బీరువాలో బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి మహ్మద్ ఖాజానే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
రూ.3 లక్షల నగలు, ఎల్ఈడీ టీవీ చోరీ
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): తంగెళ్లపల్లి గ్రామంలోని బాపూజీనగర్‌లో శనివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. ఇంట్లోనివారు బయటికి వెళ్లినపుడు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.3 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, ఒక ఎల్ఈడీ టీవీ చోరీ చేశారని ఇంటి యజమాని దుర్గారావు శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.