
రాజేందర్ (ఫైల్)
హయత్‌నగర్: భార్య దూరమైందనే మనస్థాపానికి లోనైన వ్యక్తి తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి అదృశ్యమైన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన లకావత్ రాజేందర్‌కు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది.
భార్యతో విబేధాలు తలెత్తడంతో ఆమెతో విడిపడి సోదరునితో కలిసి వేరుగా ఉంటున్నాడు. భార్య దూరమైందనే మనస్థాపంతో బాధపడుతున్న రాజేందర్ ఆదివారం ‘నేను చనిపోతున్నాను నాకోసం ఎవరూ వెతకొద్దూ’ అంటూ లేఖ రాసి వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.