సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల్ని తాళ లేక ‘తల్లి గర్భం.. సమాధిలోనే మనశ్శాంతి’ అని లేఖ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డ ప్లస్‌వన్ విద్యార్థిని కేసును మాంగాడు పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈమేరకు విచారణ వేగవంతం చేశారు. విఘ్నేష్ అనే యుకుడిని ఫోక్సో చట్టంతో పాటుగా నాలుగు సెక్షన్ల కింద సోమవారం అరెస్టు చేశారు. వివరాలు.. మాంగాడులో బ్యాంక్ ఉద్యోగి కుమార్తె (16) బలన్మరణానికి పాల్పడుతూ రెండు లేఖల్ని రాసి పెట్టడం సర్వత్రా ఉద్వేగానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖల ఆధారంగా పోలీసులు కొందరు టీచర్లు, ఆ బాలిక బంధువులు 20 మందిని ప్రశ్నించారు.
చదవండి: (ఓ ఆడబిడ్డ ఆక్రందన.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్..)
అదే సమయంలో ఆ బాలిక సెల్ ఫోన్‌లో లభించిన ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ సమాచారం ఆధారంగా విఘ్నేష్ అనే యువకుడ్ని అరెస్టు చేశారు. ఇన్‌స్టా ద్వారా ఆ బాలికతో పరిచయం పెంచుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి విఘ్నేష్ ఆ తదుపరి లైంగికంగా వేధించడం మొదలెట్టినట్టు విచారణలో తేలింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. అయితే, లేఖల్లో బంధువులు, టీచర్లు అంటూ ప్రత్యేకంగా పేర్కొని ఉండటంతో ఆ బాలికను వేధించిన వారందర్నీ కటకటాల్లోకి నెట్టే విధంగా పోలీసులు విచారణ వేగాన్ని పెంచారు.
చదవండి: (కవలలు, తల్లి లారీ కింద ఛిద్రం.. రెండు కి.మీ. వరకూ ముక్కలుగా..)
Comments
Please login to add a commentAdd a comment