
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె వంటి పాన్ ఇండియి సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో రాధేశ్యామ్ రిజల్ట్ తర్వాత నుంచి సాలిడ్ యాక్షన్ మూవీ సలార్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరిన్ని పెరిగాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమా ప్రారంభించిన కొత్తలో ప్రభాస్ లుక్ మినమా ఇంతవరకు ఈ సినిమా గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో ప్రభాస్ అభిమాని ఒకరు సలార్ అప్‌డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు లెటర్ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
'సినిమా మొదలై ఇన్ని నెలలో అవుతున్నా ఇప్పటివరకు గ్లింప్సెస్ కూడా రిలీజ్ చేయలేదు. మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కనుకు ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటా' అంటూ రాసిన లెటర్ నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment