'సలార్' బడ్జెట్ అన్ని కోట్లు.. ఇక రెమ్యునరేషన్స్ ఎవరెవరికి ఎంతంటే? | Prabhas Salaar Movie Actors Remuneration Details | Sakshi
Sakshi News home page

Salaar Remuneration: పారితోషికంలో టాప్ లేపిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కూడా!

Published Fri, Dec 22 2023 7:47 PM | Last Updated on Fri, Dec 22 2023 8:01 PM

Prabhas Salaar Movie Actors Remuneration Details - Sakshi

డార్లింగ్ ప్రభాస్ 'సలార్' దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదలడం గ్యారంటీ! మాస్ మూవీ, అందున ప్రశాంత్ నీల్ తీయడం దీనికి చాలా ప్లస్ కాబోతున్నాయి. దీంతో తొలిరోజు వసూళ్లు దద్దరిల్లిపోవడం పక్కా. సరే సినిమా టాక్ ఏంటి అనేది పక్కనబెడితే 'సలార్' కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: 'సలార్' సీక్వెల్‌కి అదిరిపోయే టైటిల్.. అసలు కథంతా ఇందులోనే!)

'కేజీఎఫ్' లాంటి సినిమాతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ఊరమాస్ సినిమా తీశాడు. అదే 'సలార్'. అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై హైప్ మాములుగా లేదు. మధ్యలో వాయిదాల వల్ల ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన మాట నిజమే. కానీ ఇప్పుడు థియేటర్లలోకి మూవీ వచ్చేసిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ప్రభాస్-మాస్ సీన్స్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశాడు. 'సలార్' మూవీకి కూడా అలా రూ.100 కోట్ల వరకు పారితోషికం, అలానే లాభాల్లో 10 శాతం షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి దాదాపు రూ.50 కోట్లు, శృతి హాసన్‌కి రూ.8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్-జగపతిబాబు తలో రూ.4 కోట్ల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. మొత్తం మూవీ బడ్జెట్ రూ 400 కోట్ల వరకు ఉంటుందని టాక్. అంటే ఓవరాల్ బడ్జెట్‌లో సగం రెమ్యునరేషన్స్‌కే నిర్మాతలు ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది!

(ఇదీ చదవండి: 'సలార్' సినిమాలో దాన్ని కావాలనే మిస్ చేశారా? లేదంటే..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement