![Nalgonda District Farmer Letter To Minister KTR - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/22/ktr_0.jpg.webp?itok=NexO_ztP)
నల్లగొండ రూరల్: తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నానని, అయితే పల్లె ప్రకృతి వనానికి తన భూమి తీసుకున్నారని పేర్కొన్నాడు. గతంలో కొంత భూమిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) కోసం సేకరించారని తెలిపాడు.
ఇంజనీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగమూ లేకపోవడం తో వ్యవసాయమే జీవనాధారంగా బతుకు సాగిస్తున్నట్లు శ్రీను లేఖలో వివరించాడు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు, ఎమ్మెల్యేకు, కనగల్ తహశీల్దార్‌కు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా మారిందని, అందువల్ల చావుకు అనుమతించాల ని కోరాడు. శ్రీను రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment