పెద్దాపురం : కన్న బిడ్డతో తల్లి అదృశ్యమైన సంఘటన పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో చోటు చేసుకుంది. పెద్దాపురం ట్రైనింగ్ ఎస్సై జోషి తెలిపిన వివరాల మేరకు.. ఆర్‌బీ పట్నం గ్రామానికి చెందిన గీసాల గంగా భవానీ (25) తన కుమారుడు వర ప్రసాద్ (4) రెండు రోజులుగా కనిపిచండం లేదని జల్లూరు గ్రామానికి చెందిన ఆమె తల్లి పిల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.