ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం | MBA student Disappear | Sakshi
Sakshi News home page

ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం

Published Mon, Jul 4 2016 4:20 AM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM

ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం - Sakshi

ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం

ఉస్మానియా యూనివర్శిటీ: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఓయూ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం...  హబ్సిగూడ ఎస్‌ఎస్‌నగర్ నివాసి వేణుముద్దల శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె ప్రియాంక (21) నల్ల నర్సింహారెడ్డి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 1న తెల్లవారుజామున 2 గంటలకు ప్రియాంక ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం కుమార్తె ఇంట్లో కనిపించకపోవడంతో ప్రియాంకకు ఆమె తల్లి ఫోన్ చేయగా..  స్నేహితులతో కలిసి షిరిడీ వెళ్తున్నట్టు చెప్పింది.

ఆ తర్వాత ఫోన్ చేస్తా సమాధానం లేదు. దీంతో ఆమె తండ్రి ఆదివారం ఓయూ పోలీసులకు తన కుమార్తె కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. ప్రియాంక ఆచూకీ తెలిసిన వారు  సెల్: 94906 16733 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement