ఓయూలో 6న దూరవిద్య ఎంబీఏ పరీక్ష | OU distance MBA exam on 6th september | Sakshi
Sakshi News home page

ఓయూలో 6న దూరవిద్య ఎంబీఏ పరీక్ష

Published Mon, Aug 31 2015 3:33 AM | Last Updated on Tue, Jul 31 2018 4:48 PM

ఓయూలో 6న దూరవిద్య ఎంబీఏ పరీక్ష - Sakshi

ఓయూలో 6న దూరవిద్య ఎంబీఏ పరీక్ష

 సాక్షి, హైదరాబాద్: ఓయూ దూరవిద్యలో 2015-16 విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు సెప్టెంబర్ 6న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు డెరైక్టర్ ప్రొ.హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థులు వచ్చే నెల 4 నుంచి హాల్‌టికెట్లను ఓయూ వెబ్‌సైట్ లేదా దూరవిద్య వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఉదయం 10  నుంచి 11.30 వరకు నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ నెల 30న జరగాల్సిన ఈ పరీక్షను అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వచ్చే నెల 6కు వాయిదా వేసినట్లు డెరైక్టర్ తెలిపారు.
 
యూ పీజీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఓయూ పరిధిలో జరిగిన పలు ఎంఏ రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో మార్కుల జాబితాలను ఆయా కాలేజీలకు జారీ చేయనున్నట్లు చెప్పారు. నేడు (31న) ఎమ్మెస్సీ కోర్సుల ఫలితాలతో పాటు ఇది వరకు ప్రకటించని ఇతర పీజీ కోర్సుల ఫలితాలను వెల్లడించనున్నట్లు పీజీ కోర్సుల అడిషనల్ కంట్రోలర్ ప్రొ.సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement