ముగ్గురు యువతుల అదృశ్యం | The disappearance of three young women | Sakshi
Sakshi News home page

ముగ్గురు యువతుల అదృశ్యం

Published Tue, Feb 2 2016 4:31 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

ముగ్గురు   యువతుల అదృశ్యం

ముగ్గురు యువతుల అదృశ్యం

 మెదక్ టౌన్: ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటనలు ఆలస్యంగా వెలుగుచూశాయి. మెదక్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామానికి చెందిన జెల్ల శృతి (19) పట్టణంలోని చర్చికాంపౌండ్‌లో గల తన బంధువుల ఇంటికి ఇటీవల వచ్చింది. గత నెల 27న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ లేకపోవడంతో శనివారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉండే సౌమ్య (19) హైదరాబాద్‌లో బీటెక్ చేస్తోంది.

మెదక్ పట్టణంలోని అజంపురా వీధిలో ఉండే మేనమామ అల్లం సంతోష్ ఇంటికి సంక్రాంతి సెలవులకు వచ్చింది. జనవరి 25న కడుపునొప్పిగా ఉంది. టాబ్లెట్స్ తెచ్చుకుంటానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన సౌమ్య తిరిగి రాలేదు. దీంతో ఆమె మేనమామ శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన వంజరి రాధ (20) మెదక్ పట్టణంలో రెండేళ్లుగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేస్తుంది. ఈనెల 25న స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement