Sculptors
-
Dalavai Shivamma: అమ్మ గీసిన బొమ్మ
దళవాయి శివమ్మ... తోలుబొమ్మల చిత్రకారిణి. తోలు మీద అపురూప చిత్రాలను గీస్తూ ‘శిల్పగురు’ జాతీయ పురస్కారానికి ఎంపికైన తెలుగు మహిళ శివమ్మ.దళవాయి శివమ్మది ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మల కుంట గ్రామం. తోలుబొమ్మలపై అద్భుతమైన చిత్రాలను సృజనాత్మకంగా చిత్రీకరిస్తోంది. శ్రీకృష్ణ చరిత్ర, విశ్వరూప హనుమ ఘట్టాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారులకు అందించే శిల్పగురు అవార్డుకు ఈ ఏడాది శివమ్మను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక మహిళ ఆమె. కేంద్ర చేనేత, జౌళి, హస్త కళల శాఖ ఆమెకు శిల్పగురు అవార్డును ప్రకటించింది. ఈమె ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ అవార్డు ప్రధానం చేసింది.తోలుబొమ్మల తయారీ దళవాయి శివమ్మ కుటుంబవృత్తి. భర్త ్ర΄ోత్సాహంతో ఆమె తోలుబొమ్మలను తయారు చేయడంలో నైపుణ్యాన్ని సాధించారు.. తాతముత్తాతల కాలం నాటినుండి వారికి ఈ కళపై పట్టు ఉండటంతో మారుతున్న ఫ్యాషన్ ΄ోటీ ప్రపంచానికి ధీటుగా వైవిధ్యమైన బొమ్మలను చిత్రిస్తున్నారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న ల్యాంప్సెట్లు, పెయింటింగ్స్, డోర్హ్యాంగర్స్, రామాయణ ఘట్టాలు, సుందరకాండ, శ్రీకృష్ణలీలలు, విశ్వరూప హనుమల ఘట్టాలు ్ర΄ాచుర్యం ΄÷ందాయి.విదేశాల్లో మన బొమ్మలుశివమ్మ తయారు చేస్తున్న తోలుబొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో΄ాటు యూరప్, అమెరికా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ కళ తనతో ΄ాటే అంతరించి ΄ోకుండా నాలుగు తరాల ΄ాటు కొనసాగాలని ఆమె ఆకాంక్ష. అందుకోసం కొత్తతరానికి శిక్షణ ఇస్తోంది. గ్రామీణ మహిళలకు ఉ΄ాధిని కల్పిస్తోంది. ఈ తోలుబొమ్మలను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. దళవాయి శివమ్మ కుమారుడు కుళ్లాయప్ప తోలుబొమ్మల తయారీలో జాతీయ స్థాయి అవార్డులు, వియత్నాం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వీరి కుటుంబం ఎంతో మంది కళాకారులకు ప్రేరణగా నిలుస్తోంది. ఇది కళకు దక్కిన గౌరవంకేంద్ర ప్రభుత్వం తనకు శిల్పగురు అవార్డును ప్రకటించడం యావత్ హస్తకళలకు, కళాకారులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. వందల యేళ్లనాటి పురాతన కళ అయిన తోలుబొమ్మలను తాతల కాలం నుండి తయారు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో తమ ఉత్పత్తులకు ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉంది. మా కళ అంతరించి ΄ోకుండా ఎంతో మందికి నేర్పాలన్నదే నా జీవిత లక్ష్యం. – దళవాయి శివమ్మ, తోలుబొమ్మల చిత్రకారిణి, జాతీయ అవార్డు గ్రహీత – కొత్త విజయ్‌భాస్కర్‌రెడ్డి, సాక్షి, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా -
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
ఆమె అందరిలా కాదు. సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టం. విభిన్నంగా ఉండటం తన నైజం. అందుకే చిన్నప్పటినుంచీ అందరిలా రంగుల లోకంలో విహరించలేదు. రంగులనే తన లోకంగా ఎంచుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు..అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దే గొప్ప శిల్పిగా అవతరించారు. మహిళా శిల్పిగా గత రెండు దశాబ్దాలుగా అనేక అపురూప శిల్పాలతో దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్న డా. స్నేహలత ప్రసాద్‌ను సాక్షి.కాం పలకరించింది.ప్రతి మహిళకూ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉంటుంది. కానీ కుటుంబం, పెళ్లి, పిల్లల బాధ్యతలు వారికి కల సాకారానికి బ్రేక్ పడుతుంది. కానీ ఆ తరువాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తామేంటో నిరూపించుకుంటారు. ఆ కోవకు చెందిన వారే డా. స్నేహలత. ఆ అవకాశమే ‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటారు స్నేహలత. ఈ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు సృష్టించకుండా, చేయూతనందిస్తే అద్భుతాలు సృష్టిస్తారంటారు ఆమె. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జన్మించారు స్నేహలత. తల్లి లీలాదేవి అండతో కళారంగంలోకి అడుగుపెట్టారు. ఫైన్ ఆర్ట్స్సబ్జెక్ట్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఆ తరువాత పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. పెళ్ళి తరువాత హైదరాబాద్‌కు రావడం, ఇద్దరు సంతానం కుటుంబం, పిల్లల బాధ్యతల నేపథ్యంలో ఆమె ఆలోచనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ తనలోని సృజనాత్మక సామర్థ్యాలను వెలికి తీయాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది.బాధ్యతల్లో కాస్తంత వెసులుబాటు, భర్త డా.ప్రసాద్ తోడ్పాటుతో తన కరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని అంటారు డా. స్నేహలత. అరుదైన తన కళకు ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఆకాశమే హద్దుగా ఎదిగారు. అతిపెద్ద పెయింటింగ్ వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమె కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు. ప్రకృతి, పర్యావరణ ప్రేమికురాలు కూడా. ప్రకృతి మీద ఆమెకున్న ప్రేమ అంతా ఆమె ప్రతీ పెయింటింగ్‌లోనూ గోచరిస్తుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు. దాదాపు అన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ విజయమే తనకు మరింత ప్రోత్సాహాన్నించింది అన్నారు ఆమె.చిత్రకళ కరియర్ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా శిల్ప కళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ కళమీద అంతులేని మక్కువ ఏర్పడింది. పట్టుదలగా అందులోనూ రాణించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మహిళా శిల్పులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె తొలి శిల్పం తెలంగాణా తల్లిది కావడం విశేషం. అలాగే పారిశ్రామిక వ్యర్థాలను అందమైన కళాకృతులుగా, రాయి, ఫైబర్ ఇలా మీడియం ఏదైనా దాన్ని అద్భుతంగా మలచడంలోనూ ఆమెది అందె వేసిన చేయి.స్నేహఆర్ట్స్ పేరుతో ఆర్ట్ క్యాంపులు, ఆర్ట్ ఫెయిర్, కోర్సులు, ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్లు, ఆర్ట్ టాక్‌లు, లైవ్ డెమోలు, డాక్యుమెంటరీలతో ఎపుడూ బిజీగా ఉండే స్నేహలత ‘రంగభూమి’ అనే వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పుణేలో పర్యావరణ శిల్పంపుణేలోని వాకాడ్‌లో, కస్తూరి చౌక్ వద్ద ఇటీవల ఒక పర్యావరణ శిల్పాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో కార్మికుల భద్రతకు చిహ్నమైన టోపీ,సమాజానికి, స్థిరత్వానికి మధ్య కీలకమైన బంధాన్ని తెలిపేలా డీఎన్ఏ గొలుసు, ఇంకా పరిశ్రమలు,శక్తి, ఆవిష్కరణల మేళవింపుతో దీన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ ,వాతావరణ మార్పులపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 21 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రెండునెలలపాటు శ్రమించి తయారు చేయడం విశేషం. తెలంగాణా కోసం చార్మినార్పుట్టింది రాజస్టాన్లోనే అయినా తనకిష్టమైన కళలో రాణించింది మాత్రం హైదరాబాద్ వచ్చిన తరువాతే. అందుకే హైదరాబాద్ కోసం ఏదైనా చేయాలనే తపన నాలో చాలా ఉంది. తనకు అవకాశం లభిస్తే పరిశ్రమలనుంచి వచ్చిన ఇనప వస్తువులు, బోల్ట్‌లు, నట్లు తదితర స్క్రాప్‌తో తెలంగాణాకు తలమానికమైన చార్రితక కట్టడం ‘చార్మినార్’ను యథాతథంగా నిర్మించాలనుకుంటు న్నాననీ, అది కూడా సందర్శకులు చార్మినార్ పైకి ఎక్కి నగర అందాలను దర్శించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలనుంచి సహకారం లభిస్తే దీన్ని సాధించి తీరుతానని చెప్పారు.చెత్తనుంచే చిత్రమైన కళాకృతులుపనికిరాకుండా పారవేసే చెత్త, ఇతర వ్యర్థాలనుంచి కళాఖండాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ముప్పును తగ్గించడం ఒక మహిళగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య నివారణలో అందరమూ తలా ఇంత చేయాల్సిందే అని సూచించారు.చిన్నప్పటినుంచీ గొప్పగా, పెద్దగా సాధించాలనేదే నా తాపత్రయం. అందుకే మహిళలకు ప్రవేశం అరుదుగా లభించే శిల్ప కళను ఎంచుకున్నాను. శిల్పాన్ని చెక్కేటపుడు వచ్చే దుమ్ము, ధూళి నాకు కనిపించదు. 200 ఏళ్లకు పైగా చరిత్రను చూసిన ఒక పవిత్రమైన వస్తువును స్పృశిస్తున్న పారవశ్యం. అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డకు ప్రాణం పోసినంత సహజంగా శిల్పం ఆవిష్కృతమవుతుంది అంటారామె. అందుకే అనేక అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి. చిత్ర కళ అయినా, శిల్ప కళ అయినా ఇందులోనే గణితం కూడా ఇమిడి ఉంటుంది. ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే పోవాలి. నా జీవితమూ అంతే. ఒక లెక్క ప్రకారం కలలు, కళల మేళవింపుతో ఒక అందమైన చిత్రంగా మల్చుకున్నాను అని చెప్పారు స్నేహలత.విద్యార్థుల కోసం గురుకులం‘‘గురుకుల లాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పట్టుదలగా, పూర్తి నిబద్దతతో చిత్రకళను, శిల్ప కళను నేర్చుకోవాలనే వారికి శిక్షణ ఇవ్వాలనేది నా లక్ష్యం. విద్యార్థులకు సరియైన రీతిలో శిక్షణ ఇవ్వాలి. దేశ సంస్కృతీ,సంప్రదాయాల మీద వారికి అవగాహన కల్పించాలి. ఆసక్తిని కలిగించాలి. అపుడే వారు ఎవరూ ఉహించలేని అద్భుతాలు సృష్టిస్తారు.’’- స్నేహలతమహిళలకో మాట‘ఆడపిల్లలకు కూడా ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. పట్టుదలా ఉంటుంది. కానీ తొలుత నచ్చింది నేర్చుకోవడంలో అడ్డంకు లొస్తాయి. తీరా చదువుకున్నాక, కుటుంబం ముందు, కరియర్ తరువాత అనే కట్టుబాట్లు మరింత అవరోధంగా మారతాయి. ఇలాంటి కారణాల రీత్యా చాలామంది తమలోని ఆశలను చంపేసు కుంటున్నారు. కానీ, అలా కాదు. దొరికిన వెసులుబాటును ఉపయోగించుకుని మహిళలు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. సానుకూల ధోరణి, దృక్పథంతో ముందుకు పోవాలి...’ ఇదీ స్నేహలత మాట! -
భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!
అయోధ్యలోని భవ్యరామాలయంలో రామ్‌లల్లా ప్రతిష్టుతుడైనప్పటి నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ రామ్‌లల్లాను బాలా రాముడి విగ్రహాన్ని ముగ్ధమనోహారంగా అందర్నీ చూపుతిప్పుకోని రీతీలో ఆకర్షణగా తీర్చిదిద్దారు ప్రముఖ శిల్పి యోగిరాజ్. ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు కృష్ణ శిలను ఎంపిక చేసుకోవడమే గాక రాముడి కళ్లను చక్కగా చిన్నపిల్లాడిలా నవ్వుతున్నట్లు తీర్చిదిద్దడం అందర్నీ భక్తితో తన్మయత్వానికి గురయ్యేలా చేసింది. ప్రతి ఒక్కరూ ..శిల్పి యోగిరాజ్ కళా నైపుణ్యాన్ని వేన్నోళ్ల కొనియాడారు. ఎవరికి దక్కుతుంది ఇంతటి అదృష్టం అంటూ ప్రశంసించారు. తానుచెక్కిన శిల్పమే పూజలందుకోవడం కంటే గొప్ప వరం ఓ శిల్పికి ఏం ఉంటుంది, అలాంటి అదృష్టం ఎవరీ దక్కుతుందంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈమేరకు శిల్పి యోగిరాజ్ తాను రామలల్లా విగ్రహాన్ని, ఆ దివ్య నేత్రాల్ని చెక్కడానికి ఉపయోగించిన సుత్తి, ఉలి వంటి పనిముట్లను నెట్టింట షేర్ చేశారు. వెండి సుత్తితో కూడిన బంగారు ఉలి పోటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. వాటితోనే రాముడి దివ్య నేత్రాలను చెక్కానని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆయన తీర్చిదిద్దిన..పద్మాసనంపై ఐదేళ్ల పిల్లవాడిగా ఉన్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలో కొలువై పూజలందుకుంటోంది. ఇక శిల్పి యోగిరాజ్ ప్రసిద్ధ శిల్పాల వంశానికి చెందినవాడు. మొదట్లో ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత తన కులవృత్తినే వృత్తిగా మార్చుకుని పూర్వీకుల అడుగుజాడల్లో నడిచి ప్రముఖ శిల్పిగా మారాడు. 2008 నుంచి యోగిరాజ్ విగ్రహాలను రూపొందిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Arun Yogiraj (@arun_yogiraj) (చదవండి: ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్) -
రాముణ్ణి చెక్కిన చేతులు
ఎంబిఏ చేసిన అరుణ్ యోగిరాజ్ కొన్నాళ్లు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు.కాని అనువంశికంగా వస్తున్న కళ అతనిలో ఉంది.నా చేతులున్నది శిల్పాలు చెక్కడానికిగాని కీబోర్డు నొక్కడానికి కాదని ఉద్యోగం మానేశాడు.2008 నుంచి అతను చేస్తున్న సాధన ఇవాళ దేశంలోనే గొప్ప శిల్పిగా మార్చింది. అంతే కాదు ‘బాల రాముడి’ విగ్రహాన్ని చెక్కి అయోధ్య ప్రతిష్ఠాపన వరకూ తీసుకెళ్లింది.తమలో ఏ ప్రతిభ ఉందో యువతా, తమ పిల్లల్లో ఏ నైపుణ్యం ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలనడానికి ఉదాహరణ అరుణ్. జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో ఒక్కో విశేషం తెలుస్తూ వస్తోంది.ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహాల్లో ‘బాల రాముడి’ విగ్రహం సమర్పించే గొప్ప అవకాశం మైసూరుకు చెందిన 40 ఏళ్ల శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు దక్కింది. కర్ణాటకకు చెందిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలియచేసి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయోధ్య రామమందిరంలో ‘బాల రాముడి’ విగ్రహం ప్రతిష్ట కోసం శిల్పం తయారు చేయమని దేశంలో ముగ్గురు శిల్పులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్‌క్షేత్ర ట్రస్ట్ బాధ్యత అప్పజెప్పింది. వారిలో ఒకరు అరుణ్ యోగిరాజ్. ఇతని కుటుంబం ఐదు తరాలుగా శిల్ప కళలో పేరు గడించింది. అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవణ్ణ శిల్పులుగా కర్ణాటకలో పేరు గడించారు. అయితే అరుణ్ ఈ కళను నేర్చుకున్నా అందరిలాగే కార్పొరేట్ ఉద్యోగం వైపు దృష్టి నిలిపాడు. కాని రక్తంలో ఉన్న శిల్పకళే మళ్లీ అతణ్ణి తనవైపు లాక్కుంది. 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తున్న అరుణ్ ఇప్పటికే అనేకచోట్ల శిల్పాలు స్థాపించి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అరుణ్ తయారు చేసిన శిల్పాల్లో కేదార్‌నాథ్‌లోని ఆది శంకరాచార్య విగ్రహంతో మొదలు మైసూరులోని ఆర్.కె.లక్ష్మణ్ విగ్రహం వరకూ ఉన్నాయి. మైసూర్ రైల్వే స్టేషన్లో ‘లైఫ్ ఈజ్ ఏ జర్నీ’ పేరుతో ఒక కుటుంబం లగేజ్‌తో ఉన్న శిల్పాలు ప్రతిష్టించి అందరి దృష్టినీ ఆకర్షించాడు అరుణ్. అలా రాముడి విగ్రహం చెక్కే అవకాశం ΄÷ందే వరకూ ఎదిగాడు. 51 అంగుళాల విగ్రహం అరుణ్ చెక్కిన బాల రాముడి విగ్రహం శిరస్సు నుంచి పాదాల వరకు 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. అరుణ్ భార్య విజేత వివరాలు తెలియచేస్తూ ‘అరుణ్‌కి ఈ బాధ్యత అప్పజెప్పాక శిల్ప ఆకృతి గురించి అతడు ఎంతో పరిశోధించాల్సి వచ్చింది. దానికి కారణం బాల రాముడి విగ్రహం ఇలా ఉంటుందనడానికి ఎలాంటి రిఫరెన్స్ లేక΄ోవడమే. అందుకని అరుణ్ పురాణాల అధ్యయనంతో పాటు రాముడి వేషం కట్టిన దాదాపు 2000 మంది బాలల ఫొటోలు పరిశీలించాడు’ అని తెలిపింది. ఈ విగ్రహం కోసం ట్రస్ట్ శిలను అందించింది అరుణ్‌కు. ‘మామూలు గ్రానైట్ కంటే ఈ శిల దృఢంగా ఉంది. చెక్కడం సవాలుగా మారింది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశం ఎంత విలువైనదో గ్రహించిన అరుణ్ రేయింబవళ్లు శిల్పాన్ని చెక్కి తన బాధ్యత నిర్వర్తించాడు’ అని తెలిపింది విజేత. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తల్లి ఆనందం కుమారుడు చెక్కిన శిల్పం రామ మందిరంలోప్రాణప్రతిష్ఠ చేసుకోనుందన్న వార్త విన్న అరుణ్ తల్లి ఆనందంతో తబ్బిబ్బవుతోంది. మరణించిన భర్తను తలచుకొని ఉద్వేగపడుతోంది. ‘అరుణ్ వాళ్ల నాన్న దగ్గరే శిల్పం చెక్కడం నేర్చుకున్నాడు. వాళ్ల నాన్న పేరు నిలబెడుతున్నాడు’ అంది. తల్లిదండ్రులు తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల బాగు కోరుతారు. అయితే అన్నీ తాము ఆదేశించినట్టుగా పిల్లలు నడుచుకోవాలన్న «ధోరణి కూడా సరి కాదు. పిల్లలు తమకు ఇష్టమైన చదువులు చదవాలనుకుంటే ఎందుకు ఆ కోరిక కోరుతున్నారో పరిశీలించాలి. కళాత్మక నైపుణ్యాలుండి ఆ వైపు శిక్షణ తీసుకుంటామంటే వాటి బాగోగుల గురించి కనీసం ఆలోచించాలి. కఠినమైన చదువులకు అందరు పిల్లలూ పనికి రారు. రాని చదువును తప్పక చదవాల్సిందేనని హాస్టళ్లల్లో వేసి బాధించి ఇవాళ చూస్తున్న కొన్ని దుర్ఘటనలకు కారణం కారాదు. ఐశ్వర్యంతో జీవించడానికి కొన్నే మార్గాలు ఉండొచ్చు. కాని ఆనందంగా జీవించడానికి లక్షమార్గాలు. పిల్లల ఆనందమయ జీవితం కోసం చిన్నారుల ఆలోచనలను కూడా వినక తప్పదు. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
గ్రాము గోల్డ్.. రెండు గంటలు.. సూక్ష్మ బంగారు ‘ఆస్కార్’..
సాక్షి, పెద్దాపురం(కాకినాడ జిల్లా): నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి అభినందనలు తెలుపుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత, కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన బంగారు శిల్పి తాళాబత్తుల సాయి సూక్ష్మ ఆస్కార్ అవార్డు ప్రతిమ రూపొందించారు. ఒక గ్రాము బంగారం వినియోగించి 15 మిల్లీ మీటర్ల పొడవుతో ఈ ప్రతిమను రెండు గంటల సమయంలో తయారు చేసి అందరి మన్ననలూ అందుకున్నారు. చదవండి: రాజమౌళితో మాట్లాడటానికి ప్రయత్నించా, కానీ: RRR నిర్మాత -
మన కళలను మనమే కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ రంగం నుంచి సామాన్య పౌరుల వరకు ప్రతి ఒక్కరూ మన శిల్పులు, చేతివృత్తి కళాకారుల ఉత్పత్తులను కొనడం ద్వారా వారిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ఇలా చేయడం ద్వారా మన కళలు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు మన వంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుందన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌ను ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. భారతీయ శిల్పులు, చేతివృత్తి కళాకారులకు అవసరమైన మేర రుణాలు అందించడం, వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వసతులు కల్పించడం అవసరమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వారికాళ్ల మీద వారు నిలబడే పరిస్థితిని కల్పించినప్పుడే వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే వీలుంటుందన్నారు. కళలను పాఠ్యాంశాల్లో చేర్చాలి వివిధ రకాల భారతీయ కళలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరాన్ని వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. విద్యతో పాటు కళల్లో రాణించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను గిరిజన సంప్రదాయాలు, నృత్యాలకు అంకితం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 550 మంది స్థానిక కళాకారులతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు మాట్లాడారు. 580 మంది జానపద కళాకారులు, 150 మందికి పైగా చేతివృత్తి కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన దాదాపు 150 మంది నృత్య కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. భిన్నసంస్కృతులపై అవగాహన అవసరం భిన్న ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతులను ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో చేతి వృత్తులు–వంటకాల ప్రదర్శనను శుక్రవారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. కాగా పలు ఉత్పత్తుల స్టాల్స్, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కిషన్‌రెడ్డి సన్మానించారు. -
ఉడ్ కార్వింగ్ కళాకారులపై సాక్షి స్పెషల్ రిపోర్ట్
-
తుప్పల్లో ‘తొలి తెలుగు శాసనం’
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మి లిపి నుంచి తెలుగు రూపాంతరం చెందాక తొలిసారి తెలుగు అక్షరాలు లిఖించిన తెలుగు శాసనం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. ఆ ప్రాంతాన్ని ఇప్పటివరకూ సర్కారు రక్షిత ప్రాంతంగా గుర్తించకపోవడంతో ఆ శాసనం బయటిప్రపంచానికి అది కనిపించకుండా పొదల చాటున తుప్పల్లో దీనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. క్రీ.శ. 430ల్లో ‘తొలుచువాండ్రు’..: నగర శివారులోని కీసరగుట్టలో ఈ తొలి తెలుగు శాసనం ఉంది. క్రీ.శ.430 కాలంలో విష్ణుకుండిన మహారాజు రెండో మాధవవర్మ కాలంలో గుండుపై తెలుగు లిపిలో ‘తొలుచువాండ్రు’ పదాన్ని చెక్కారు. అప్పట్లో అక్కడ అద్భుత ఆలయాన్ని నిర్మించేందుకు వివిధ ప్రాంతాల నుంచి శిల్పులు వచ్చారు. వారు శిల్పాలను చెక్కే క్రమంలో కొంతకాలం అక్కడే ఉన్నారు. ఇందుకోసం వీలుగా బస ఏర్పాటు చేసుకున్నారు. అది శిల్పులుండే ప్రాంతమని చెప్పుకోవడానికి వీలుగా అక్కడి పెద్ద గుండుపై ‘తొలుచువాండ్రు’ (రాళ్లను తొలిచేవారు) అని ఐదక్షరాలను పెద్ద ఆకృతిలో చెక్కారు. దాన్ని చరిత్రకారుల పరిభాషలో నామక శాసనం (లేబుల్ ఇన్స్క్రిప్షన్) అంటారు. ఆ అక్షరాలు ప్రస్తుత తెలుగు లిపికి తొలి రూపం. ఆ లిపి ఎన్నో మార్పులు చెందుతూ ప్రస్తుతం వాడుతున్న తెలుగు లిపి ఏర్పడింది. ఎంతో అపూరూపమైన వారసత్వ ఆస్తిని పురవావస్తు శాఖ ఇప్పటికీ అధికారికంగా రక్షిత ప్రాంతంగా గుర్తించలేదు. పరిరక్షణ చర్యలు చేపట్టలేదు. కీసరగుట్ట రియల్ ఎస్టేట్ పరంగా వేగంగా పురోగమిస్తున్నందున ఏ క్షణాన గుట్టలను పిండి చేసే క్రషర్లు, క్వారీల మధ్య శాసనం పిండి అయిపోతుందోనని చరిత్రకారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడుందో తెలుసుకోలేక.. ఇటీవల చరిత్ర అభిమాని దీకొండ నర్సింగరావు దాన్ని చూసేందుకు వెళ్లారు. గంటలతరబడి వెతికినా జాడ తెలియలేదు. చివరకు కొందరు సహాయకులతో తుప్పలు గాలిస్తూ చెట్ల కొమ్మలు తప్పిస్తూ వెతకగా గుండు కనిపించింది. దాని చుట్టూ పొదలు అల్లుకుని బయటి ప్రపంచానికి అది కనిపించకుండా పోయిందని ఆయన ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాన్ని వెంటనే రక్షిత ప్రాంతంగా ప్రకటించి గుండు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయాలన్నారు. ఆ శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా ప్రకటించి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని చరిత్ర పరిశోధకులు డిమాండ్ చేస్తున్నారు. -
శిల్పకళకు 'త్రీడీ' తళుకులు
తెనాలి: కాంస్య విగ్రహాలు, ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో గుర్తింపును పొందిన తెనాలి సూర్య శిల్పశాల శిల్పులు మరో అడుగు ముందుకేశారు. తమ నైపుణ్యానికి త్రీడీ టెక్నాలజీని ఆలంబనగా చేసుకుని మినీయేచర్ విగ్రహాల తయారీకి పూనుకున్నారు. ఇటీవల మృతిచెందిన కన్నడ సినిమా పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేసి, శుక్రవారం విలేకరుల ముందు ప్రదర్శించారు. దేవాలయాల రూపశిల్పి అయిన తండ్రి నుంచి వారసత్వంగా శిల్పకళను అందిపుచ్చుకున్న కాటూరి వెంకటేశ్వరరావు తన పరిధిని విస్తరించారు. ఆలయాలు, రాజగోపురాల రూపకల్పనతోనే సరిపెట్టకుండా.. సిమెంటు, ఫైబర్, కాంస్యం వంటి విభిన్న పదార్థాలతో విగ్రహాలు తయారుచేస్తూ వచ్చారు. ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కొడుకు రవిచంద్ర కలిసిరావటంతో వారి సృజన ఎల్లలు దాటింది. ఐరన్ స్క్రాప్‌తో భారీ విగ్రహాలను తయారుచేసి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. తాజాగా కాటూరి వెంకటేశ్వరరావు రెండో కుమారుడు శ్రీహర్ష త్రీ–డీ టెక్నాలజీతో విగ్రహాల తయారీలో శిక్షణ పొందాడు. తమ శిల్పశాల ఆర్ట్ గ్యాలరీలో తొలిగా పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేశారు. బస్ట్ సైజు 12 అంగుళాల్లో, ఫుల్ సైజ్ 15 అంగుళాల ఎత్తులో వీటిని తయారు చేశారు. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో, ఆఫీసుల్లో టేబుల్‌పై ఉంచుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్తగా చేస్తున్న ఈ మినీయేచర్ విగ్రహాలతో తమ శిల్పశాల ఖ్యాతి మరింతగా ఇనుమడిస్తుందని శిల్పి శ్రీహర్ష అన్నారు. -
3 టన్నుల ఇనుముతో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
తెనాలి: తెనాలి శిల్పకారులు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 14 అడుగుల విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో తయారు చేశారు. సూర్య శిల్పశాల నిర్వహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రలు 3 టన్నుల ఇనుప వ్యర్థాలను ఉపయోగించి, 3 నెలల శ్రమతో అంబేడ్కర్ విగ్రహాన్ని వీరు తీర్చిదిద్దారు. శిల్పశాల ఎదుట ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహంతో ఎమ్మెల్యే శివకుమార్ -
ఆళ్లగడ్డ టు అమెరికా: గ్రేట్ జర్నీ, బతుకు శిల్పం
ఆళ్లగడ్డ శిల్పకారులు పుట్టిన గడ్డ. ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియచేసిందో అమ్మాయి. ఆళ్లగడ్డ అమ్మాయి చేసిన ప్రయత్నం ఆ ఊరికి వన్నె తెచ్చింది. సినిమా రంగం నెత్తుటి చారికలు అద్దిన ఆళ్లగడ్డను ఈ అమ్మాయి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసింది. ఆళ్లగడ్డలో శిల్పకారుల కుటుంబాలు వందలాదిగా ఉన్నాయి. ఈ సంగతి కర్నూలు జిల్లా వాళ్లకు తప్ప బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని రోజుల్లో భువనేశ్వరి చేసిన ఒక ప్రయత్నంతో ఈ రోజు ఆళ్లగడ్డ ఇంటర్నెట్లో విశ్వవిహారం చేస్తోంది. తల వంచుకుని శిల్పాలు చెక్కుతూ తెరవెనుక ఉండిపోయిన శిల్పకారులు ఈ రోజు యూ ట్యూబ్‌లో ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. జీవితంలో ఎదురైన విషమ పరీక్షకు సమాధానంగా తన జీవితాన్ని తానే చెక్కుకునే క్రమంలో ఆమె ఎంచుకున్న మార్గమే ఆమెను ఈ రోజు ‘శిల్పకారిణి భువనేశ్వరి’గా నిలబెట్టింది. ఉలి పట్టుకునే నేర్పు ‘పని మీద ధ్యాస పెట్టు. మనసు కుదుట పడుతుంది’ నాన్న అన్న ఈ మాట నా జీవితాన్ని కొత్తగా పట్టాలెక్కించింది అంటోంది శిల్పి భువనేశ్వరి. ‘‘జీవితం మనల్ని పరీక్షించడానికి క్రాస్ రోడ్స్‌లో నిలబెడుతుంది. ఎటువైపు అడుగులు వేయాలో తెలియని అయోమయంలోకి నెట్టేస్తుంది. అలాంటి క్షణంలో నాన్న చెప్పిన మాట నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేటట్లు చేసింది. ఉలి పట్టుకున్నాను. విజేతగా నిలబడగలిగాను. ఈ కళలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ఉలి పట్టుకునే వరకే మనం. శిలను చూస్తూ ఉలి చేతిలోకి తీసుకున్న తర్వాత ఇక ఏ ఇతర ఆలోచనలూ రావు. అప్పటి వరకు మెదడును కందిరీగల్లా విసిగించిన ఆలోచనలు కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి. తదేక దీక్షతో శిల్పాన్ని చెక్కడంలో మునిగిపోతాం. పని పూర్తయిన తర్వాత కూడా మెదడు మంచి ఆలోచనలతోనే ఉంటుంది. మనకు తెలియని పాజిటివ్ ఎనర్జీ ఆవరిస్తుంది. అలాగే మాకు శిల్పం మీద మమకారం కూడా ఉంటుంది. నేను ఈ వృత్తిలోకి వచ్చిన రెండేళ్లకు కాలిఫోర్నియా నుంచి రాముడి విగ్రహాల సెట్ ఆర్డర్ వచ్చింది. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు విగ్రహాల సెట్. పదకొండు అంగుళాల విగ్రహాలు. చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. వాటిని ఇచ్చేటప్పుడు కొంచెం బాధనిపించింది’’ గుర్తు చేసుకుంది భువనేశ్వరి. ఒక యాదాద్రి... మరో బుద్ధవనం! తెలంగాణలో సీయెం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యాదాద్రి నిర్మాణంలో కొంతభాగం పనిని భువనేశ్వరి శిల్పుల బృందం పూర్తి చేసింది. నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్, బుద్ధవనంలో బుద్ధుడి జీవిత చిత్రాల వెనుక భువనేశ్వరి ఉలి నైపుణ్యం ఉంది. ‘‘నేను 2013 నుంచి పూర్తిగా శిల్పకళ మీద దృష్టి పెట్టాను. అప్పటికే మా నాన్న, పెదనాన్న యాదాద్రి పనులు మొదలు పెట్టారు. అలా అంత పెద్ద ప్రాజెక్టులో పని చేసే అవకాశం వచ్చింది. బుద్ధవనం ప్రాజెక్టు నిర్వహణ స్వయంగా చేపట్టాను. దీనితోపాటు అనేక పనులు సమన్వయం చేయడం మొదలు పెట్టాను. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి పుష్కరాల సమయంలో విగ్రహాలు చేశాం. మా శిల్పాలను చూసిన అధికారులు బాగున్నాయని మంచి ఆర్డర్లు ఇచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో రాతి బెంచ్‌లు, ఫౌంటెయిన్లు ఎన్నింటినో చేశాం. ఈ కరోనా సమయంలో సమూహంగా చేయాల్సిన పెద్ద ప్రాజెక్టులేవీ చేయడం లేదు. ఇళ్లలో షో పీస్‌లుగా విగ్రహాలు పెట్టుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. ఆళ్లగడ్డలోని మా శిల్పకళామందిరంలోనే చిన్న ఆర్డర్లు పూర్తి చేస్తున్నాం. తెర ముందుకు శిల్పులు మా శిల్పకారులు ఎప్పుడూ తెర వెనుకే ఉంటారు. చిత్రకారులు ఇది నేను వేసిన చిత్రం అని చెప్పుకోవడానికి సంతకం చేస్తారు. శిల్పకారులకు ఆ అవకాశం ఉండదు. అందుకే మా శిల్పకళామందిరంలో పని చేసే శిల్పకారులను వీడియో తీసి ఫేస్బుక్, యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తుంటాను. మా పనిలో గొప్పదనాన్ని తెలియచేయడానికి నేను చేస్తున్న ఓ చిన్న ప్రయత్నం మంచి ఫలితాలనే ఇస్తోంది. మా శిల్పకారులకు శిలకు ప్రాణం పోయడమే తెలుసు, కళను ప్రమోట్ చేసుకోవడం తెలియదు. ఆ పనిని నేను చేస్తున్నాను. నన్ను చూసి మా వాళ్లు చాలా మంది వాళ్ల అమ్మాయిలకు కూడా శిల్పాలు చెక్కడం నేర్పిస్తామని చెప్తున్నారు. ఆ మాట నాకు సంతోషాన్నిస్తోంది. శిల్పాలు చెక్కుతున్న తొలి మహిళ గా ఉలిని పట్టుకోవడంతోనో, విశ్వకర్మ ఎక్స్‌లెన్స్, లెజెండరీ అవార్డులను అందుకోవడంతోనో నేను గమ్యాన్ని చేరినట్లు కాదు. మా కళకు ప్రాచుర్యాన్ని, గౌరవాన్ని తీసుకువచ్చే బాధ్యత కూడా చేపట్టాను. అమ్మాయిలను శిల్పకారిణులుగా తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యాన్ని చేరే వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది’’ అంటోంది భువనేశ్వరి. ఆళ్లగడ్డ అమ్మాయి ఏ దేవాలయానికి వెళ్లినా, చారిత్రక కట్టడాన్ని చూసినా శిల్పసంపదను చూస్తూ మైమరచి పోతాం. రాతికి జీవం పోసిన శిల్పులను అపరబ్రహ్మలుగా కీర్తిస్తాం. యుగాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఈ కళాత్మకమైన వృత్తిలో సాధారణంగా మగవాళ్లే ఉంటారు. మగవాళ్లకు సహాయంగా చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఆడవాళ్లు. ఈ ఆనవాయితీని మార్చేసింది దురుగడ్డ భువనేశ్వరి. ఇది మగవాళ్ల ప్రపంచం అని చెప్పకుండా చెప్పే ఒక నియమాన్ని సవరించింది. కంటికి కనిపించని ఒక సరిహద్దును చెరిపేసింది. తానే స్వయంగా ఉలి పట్టుకుని శిల్పం చెక్కడం నేర్చుకుంది. 2018లో హైదరాబాద్ పార్క్ హయత్‌లో లేడీ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంగా... -
ఇనుములో ఓ హృదయం మొలిచెనే!
సాక్షి, గుంటూరు: ఇనుములోనూ ఓ హృదయాన్ని సృష్టించారు. అద్భుత కళానైపుణ్యంతో ఇనుప వ్యర్థాలకు జీవం పోశారు. అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ కళారూపాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. తెనాలికి చెందిన శిల్పకళాకారులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర వీటిని సృష్టించగా, వార్ఫ్రోడ్డులోని వర్క్‌షాపులో గురువారం ప్రదర్శించారు. ఆటోమొబైల్ పరికరాలతో భారీ శిల్పాలను తయారుచేస్తూ బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పాటు సింగపూర్, మలేసియా వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ప్రస్తుతం ప్రపంచ రికార్డు సాధన లక్ష్యంతో ప్రత్యేకించి ఈ తరహాలో భారీ కళాకృతులను రూపొందిస్తున్నారు. ఆరడుగుల ఎత్తులో డోలు, తబల, 15 అడుగుల పొడవైన సన్నాయి, ఎద్దుల బండి, క్రీస్తును శిలువ వేసిన బొమ్మను రూపొందించారు. -
అబ్బురం.. దుర్గి హస్త కళావైభవం
సాక్షి, గుంటూరు/మాచర్ల: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు’ అని సినీ కవి రాసిన పాటకు నిలువుటద్దంలా నిలుస్తున్నారు.. ఈ శిల్పకారులు. దేవ శిల్పి.. మయుడిని కూడా వీరు మరిపించగల నేర్పరులంటే అతిశయోక్తి కాదు. ఏ ఆకృతి లేని బండరాళ్లను తమ అద్భుత నైపుణ్యంతో సజీవశిల్పాలుగా మలిచే శిల్పకారులకు నెలవు.. దుర్గి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం ఉలితో అద్భుత శిల్పాలను చెక్కే శిల్పకారులకు నిలయంగా భాసిల్లుతోంది. దుర్గిలో అడుగుపెడితే.. శాలివాహనులు, కాకతీయుల కాలం నాటి ప్రాచీన శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంటోంది. ఇక్కడ ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు, అవసరమైతే ఇంకా ఎత్తయిన శిల్పాలను చెక్కడంలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. వీరు రూపొందించే వివిధ దేవతామూర్తులు, బుద్ధుడు, రాధాకృష్ణులు, పల్లె పడుచుల విగ్రహాల్లో కళా నైపుణ్యం తొణికిసలాడుతుంటోంది. 12వ శతాబ్దంలోనే బీజం.. దుర్గి శిల్ప కళకు క్రీ.శ.12వ శతాబ్దంలోనే బీజం పడింది. ఆచార్య నాగార్జునుడు పెందోట వాసి అని ఐతిహ్యం. పెందోట నుంచి కొంతమంది శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారు. ప్రకృతి వైపరీత్యమో, శత్రువుల దాడుల కారణంగానో 11వ శతాబ్దంలో ద్వారకాపురి కాలగర్భంలో కలిసిపోయింది. ఈ క్రమంలో ద్వారకాపురి నుంచి వలస వచ్చిన కొందరు శిల్పులు ఓ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఆ ప్రాంతానికి ‘దుర్గి’గా నామకరణం చేశారు. 15వ శతాబ్దం నాటికి దుర్గిలో 300 మంది శిల్పులు ఉండేవారని తెలుస్తోంది. అమరావతి, నాగార్జునకొండల్లోని బౌద్ధ స్థూపాలను దుర్గి కళాకారులే మలిచారని చరిత్రకారులు చెబుతుంటారు. విజయపురి సౌత్, నాగార్జునకొండకు వచ్చే బౌద్ధులు దుర్గి గ్రామాన్ని సందర్శించి.. ఇక్కడి శిల్పులు మలచిన బౌద్ధ విగ్రహాలను కొని తీసుకెళ్తుంటారు. విదేశాలకు ఎగుమతి కనుమరుగవుతున్న దుర్గి శిల్పకళను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో 1962లో అప్పటి ప్రభుత్వం దుర్గిలో శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రం ద్వారా వందల మంది శిల్ప కళలో శిక్షణ పొంది తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో రాణిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఇక్కడి విగ్రహాలు ఎగుమతి అవుతున్నాయి. 1984లో హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల ప్రదర్శనలో దుర్గి శిల్పులు చెక్కిన వాటిని మెచ్చుకున్న అప్పటి సీఎం ఎన్టీ రామారావు తర్వాత దుర్గిని సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దేవాలయానికి దశావతరాల విగ్రహాలను దుర్గి శిల్పకారులే అందించారు. తెలంగాణలోని బుద్ధ వనానికి విగ్రహాలను అందించిన దుర్గి కళాకారుడు శ్రీనివాసరావును ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ సత్కరించారు. 2017లో దుర్గి శిల్పాలకు భారత ప్రభుత్వం ఇచ్చే జియోగ్రాఫికల్ గుర్తింపు లభించింది. ఇక్కడ మలిచే లైమ్ హార్డ్ రాయి విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. అరుదైన ఈ రాయి దుర్గి గ్రామంలోనే ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ క్వారీలోనే లభిస్తుందని శిల్పులు చెబుతున్నారు. ప్రస్తుతం 15 కుటుంబాలే.. దుర్గి శిల్పకళ నానాటికి అంతరించిపోయే దిశగా అడుగులు వేస్తోందని ఇక్కడి శిల్పులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 300 కుటుంబాలు శిల్పకళలో ఉండగా ఇప్పుడు 15 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 2004కు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే శిల్పకళా శిక్షణా కార్యక్రమం కూడా ఆగిపోవడంతో కొత్తవారు రావడం లేదు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి కరోనా వైరస్ ప్రభావం శిల్పకళా రంగంపై కూడా పడింది. పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఉత్పత్తులు సరిగా అమ్ముడుపోవడం లేదు. శుభకార్యాల సీజన్లో చిన్న విగ్రహాలకు డిమాండ్ ఉండేది. గతంతో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ పడిపోయింది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తయారు చేసిన విగ్రహాలు అలానే ఉండిపోయాయి. మాకు కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి. – చెన్నుపాటి శ్రీనివాసాచారి, నాగార్జున శిల్ప కళా కేంద్రం నిర్వాహకుడు, దుర్గి వృత్తిపై మక్కువతోనే.. రెండేళ్ల క్రితం నేను బీటెక్ పూర్తి చేశాను. మా కుటుంబం మొత్తం ఈ రంగంలోనే రాణిస్తోంది. మా కుటుంబంలో నేను నాలుగో తరం శిల్పకారుడిని. వృత్తిపై మక్కువతో ఇందులో రాణిస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో 150 మంది శిల్పులు పాల్గొనగా నేను రన్నరప్‌గా నిలిచాను. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరికొందరు యువకులు ఈ రంగంలో రాణించడానికి ముందుకొస్తారు. – సాయి వినయ్, యువ శిల్పకారుడు, దుర్గి -
హే రామ్.. తుఝే సలామ్
సాక్షి, గుంటూరు: ‘రామ్ రహీమ్ ఏక్ హై’ అని శతాబ్దాల క్రితమే గళమెత్తాడు భక్త కబీర్దాస్. అదే భావంతో.. అదే బాటలో పయనిస్తూ.. హిందూ బంధువుల ఆధ్యాత్మిక చింతనకు ధ్వజాలు ఎత్తుతున్నారు ఈ ముసల్మాన్లు. గుంటూరు జిల్లా మాచవరం మండలం తురక పాలెం గ్రామంలోని ముస్లిం శిల్పకారులు ధ్వజస్తంభాలు చెక్కడంలో నేర్పరులు. తరతరాలుగా హిందూ ఆలయాలకు ధ్వజ స్తంభాలను చెక్కే వృత్తిలోనే కొనసాగుతూ.. రాముడైనా.. రహీమ్ అయినా తమకొక్కటేనని చాటుతున్నారు. వంద కుటుంబాలకు ఇదే వృత్తి ► సుమారు వందేళ్ల క్రితం తురక పాలెం గ్రామానికి చెందిన కరీమ్ సాహెబ్ ధ్వజస్తంభాలు చెక్కడం ప్రారంభించారు. ► తర్వాతి రోజుల్లో ఆయన కుటుంబీకులతోపాటు గ్రామానికి చెందిన మరికొన్ని ముస్లిం కుటుంబాలు దీనినే వృత్తిగా చేసుకున్నాయి. ► కరీమ్ సాహెబ్ నాలుగో తరానికి చెందిన కుటుంబాలు కూడా నేటికీ ఇదే వృత్తిలో రాణిస్తున్నాయి. ► ప్రస్తుతం గ్రామంలో వందకు పైగా కుటుంబాలు శిల్పాలతో కూడిన ధ్వజస్తంభాలు చెక్కుతున్నాయి. బండల్ని తొలిచి.. ► తురకపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లోని క్వారీల్లో పెద్ద పెద్ద బండలను తొలిచి ధ్వజస్తంభం ఆకృతులుగా మలుస్తారు. ► ఒక్కొక్క ధ్వజస్తంభం 20 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ► ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ధ్వజస్తంభాలు సరఫరా అవుతుంటాయి. ► ధ్వజస్తంభాన్ని చెక్కడం, లారీలోకి ఎక్కించి ఆలయానికి చేర్చే బాధ్యత వీరే చేపడతారు. మార్గమధ్యంలో దురదృష్టవశాత్తూ ధ్వజ స్తంభం విరిగితే మళ్లీ కొత్తది తయారు చేసి అందిస్తారు. ► ధ్వజస్తంభం ఎత్తును బట్టి అడుగుకు రూ.3,500 నుంచి రూ.4 వేల చొప్పున ధర ఉంటుంది. ► ఒక్కో స్తంభం చెక్కడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. 30 ఏళ్లుగా ఇదే వృత్తి 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాను. తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వేరే పనికి వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఈ వృత్తిని ఎంతో ప్రేమతో కొనసాగిస్తున్నాం. ప్రస్తుత తరం వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి మొగ్గు చూపడం లేదు. మాతోనే ఈ కళ కనుమరుగవుతుందేమో అనే బాధ ఉంది. – షేక్ అల్లాబక్షు, శిల్పకారుడు మా కళను గుర్తిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు నిర్మించినా.. ఆ కమిటీల వాళ్లు మా కళను గుర్తించి ధ్వజస్తంభం ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడకే వస్తారు. మా కళను గుర్తించి వాళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో కొత్త ఆలయాల నిర్మాణాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు. – షేక్ పెంటుసా, శిల్పకారుడు -
కరోనా వేళ.. శిల్పుల పనులు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ పనులు తుది దశకు చేరాయి. కరోనా విపత్తులోనూ శిల్పులు, కూలీలు ఆలయ పనుల్లో నిమగ్నమై పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఎకరం స్థలంలో కృష్ణశిలతో ఈ శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయం, ముఖమండపం, ప్రాకార మండపం, రాజగోపురం పనులు పూర్తయ్యాయి. ఇక ప్రధానాలయం పక్కనే ఉప ఆలయాలైన గణపతి, పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాన్ని పూర్తి చేశారు. అంతే కాకుండా నవగ్రహ మండపం, యాగశాలను సైతం ఇటీవలనే శిల్పులు పూర్తి చేశారు. ప్రధానాలయంలోని మండపాలు, నాలుగు దిశల్లో కృష్ణ శిలలతో ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధానాలయం ముందుభాగంలో బలిపీఠం, ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు దిమ్మెలు పూర్తి చేశారు. ఆలయంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా పూర్తయ్యాయి. ఆలయ పునఃప్రారంభం సమయానికల్లా స్పటికలింగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల వైటీడీఏ అధికారులు మార్కింగ్ చేశారు. సాలహారాల్లో విగ్రహాలు.. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, ఈఓ గీతారెడ్డి పర్యవేక్షణలో శిల్పాల పనులు పూర్తయ్యాయి. ప్రధానాలయ మండపాల ప్రకారాల్లోని సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుడి అవతారాలు, పార్వతి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక ముఖ మండపంలో దక్షణామూర్తి, బ్రహ్మ, భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చేందుకు ఆలయ శిల్పులు సన్నాహాలు చేస్తున్నారు. జరగాల్సిన పనులు ఇవే.. రామలింగేశ్వరస్వామి ఆలయంలో కల్యాణమండపం, రథశాలను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఆలయంలోని ఉత్తర దిశలో కల్యాణ మండపాన్ని, రథశాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల మార్కింగ్ చేశారు. ఈ పనులను త్వరలోనే చేపట్టనున్నారు. అంతే కాకుండా దక్షిణ భాగంలో ఇంకా మిగిలి ఉన్న ప్రాంతంలో కృష్ణ శిలలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేస్తున్నారు. ఇక ప్రాకారాలపై అందంగా కనిపించే విధంగా నంది విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆలయంలో విద్యుదీకరణ పనులు చేయాల్సి ఉంది. -
అమెరికాలోని శ్రీవారికి వజ్రాలతో ఆభరణాలు
సాక్షి, తెనాలి: శిల్పకళల్లో ఖండాంతర ఖ్యాతిని పొందిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అక్కల సోదరుల్లో ఒకరైన ‘కళారత్న’ అక్కల శ్రీరామ్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం క్యారీ నగరంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామికి వజ్రాభరణాలను రూపొందించారు. ఆలయ నిర్వాహకుల ప్రతిపాదనల మేరకు స్వామివారికి కఠి హస్తము, వరద, శంఖు, చక్ర హస్తములు, పాదాలను వెండితో తయారు చేసి ముంబయి నుంచి తెప్పించిన అమెరికన్ వజ్రాలను వీటిలో పొదిగారు. ఈ ఆభరణాల రూపకల్పనకు తొమ్మిది నెలల సమయం పట్టిందని శ్రీరామ్ వెల్లడించారు. ఆభరణాలను మంగళవారమే అమెరికాకు పంపుతున్నట్టు చెప్పారు. త్వరలోనే అమెరికాలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వజ్ర కిరీటాన్ని కూడా తయారు చేయనున్నట్టు తెలిపారు. కాగా, ఆభరణాల్లో వాడిన వజ్రాల విలువ రూ.10 లక్షలు పైగానే ఉంటుందని చెప్పారు. -
నేనో శిల్పిని మాత్రమే..
జూబ్లీహిల్స్: నదులన్నీ సముద్రంలో కలిసినట్లు చిత్రకారులు, కళాకారులను ఒక్కచోట చేర్చడంలో ఆర్ట్‌గ్యాలరీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని సుప్రసిద్ధ శిల్పకారుడు, గుజరాత్లో సర్ధార్ పటేల్ విగ్రహ శిల్పి, పద్మభూషణ్ రామ్‌సుతార్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మూలగుండం ఆర్ట్ గ్యాలరీని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అరేబియా సముద్రతీరం ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు పనుల్లో తీరిక లేకుండా ఉన్నానని చెప్పారు. గుజరాత్‌లోని నర్మదానది తీరంలో సర్ధార్ పటేల్ విగ్రహం ఏర్పాటు, స్థలం ఎంపిక ప్రధాని మోదీ నిర్ణయమన్నారు. తాను కేవలం విగ్రహ శిల్పిని మాత్రమే అని అన్నారు. చిన్నప్పుడు తాను విగ్రహాలు చేస్తుండగా పలువురు చూసి మెచ్చుకోవడంతో తాను ఇదే వృత్తిని ఎంచుకున్నానని, ఇష్టంతోనే ఈ వయస్సులో కూడా చురుగ్గా పని చేస్తున్నట్లు చెప్పారు. గ్యాలరీలోని చిత్రాలను వీక్షించారు. గ్యాలరీ నిర్వాహకులు మూలగుండం శాంతి, కృష్ణ, ప్రముఖ చిత్రకారుడు జగదీష్‌మిట్టల్, చరిత్రకారుడు వేదకుమార్, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, పలువురు కళాప్రియులు పాల్గొన్నారు. -
రెండు రాళ్లు
అందరూ కలిసి ఆ బండరాళ్ల వద్దకు వచ్చారు. వాటిని చూసి సంతృప్తి చెంది, రేపు మళ్లీ వచ్చి వాటిని తరలిద్దామని చెప్పుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. అదొక అడవి. అక్కడ రెండు పెద్ద బండరాళ్లు చాలాకాలంగా ఉంటున్నాయి. ఒకే చోట ఏళ్ల తరబడి ఉంటూ ఉండటంతో వాటికి విసుగు పుట్టింది. మనం ఇక్కడి నుంచి ఎప్పటికైనా ఎటైనా పోగలమా అని లోలోపల బాధ పడ్డాయి. ఆ అడవికి సమీపంలో ఓ నగరం ఉంది. ఆ ఊరి ప్రజలు ఓ రోజు సమావేశమై ఓ ఆలయం కట్టాలని తీర్మానించుకున్నారు. కొత్తగా నిర్మించదలచిన ఆలయానికి మూల విరాట్టు, మరికొన్ని దేవతా విగ్రహాలను చెక్కించడానికి శిల్పులను నియమించారు. వారిలో ఓ శిల్పి బండరాళ్లను వెదుకుతూ ఈ రెండురాళ్లను చూశాడు. వెంటనే అతను వెళ్లి తన తోటి శిల్పులకు వీటి గురించి చెప్పాడు. అందరూ కలిసి ఆ బండరాళ్ల వద్దకు వచ్చారు. వాటిని చూసి సంతృప్తి చెంది, రేపు మళ్లీ వచ్చి వాటిని తరలిద్దామని చెప్పుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. అది చూసి ‘‘అమ్మయ్య ఇంతకాలానికి మనకీ అడవి నుంచి విముక్తి కలగబోతోంది. నా కల నెరవేరబోతోంది’’ అని సంబరపడింది ఒక రాయి. ‘‘వాళ్లు నన్ను తీసుకువెళ్లి ఉలితో చెక్కి చెక్కి శిల్పాలుగా తయారు చేస్తారు.. నేను భరించలేనా దెబ్బలను. రేపు ఆ శిల్పులు వచ్చేసరికి నేను ఇక్కడే మరింత లోతుగా పాతుకుపోతాను’’ అనుకుంది రెండో రాయి. తెల్లవారింది. మరుసటి రోజు శిల్పులు మళ్లీ ఈ రాళ్లున్న చోటుకి చేరుకున్నారు. మొదటి భారీ రాయిని అందరూ కలిసి ఓ వాహనం మీదకు ఎక్కించారు. రెండోరాతిని అంగుళం కూడా కదల్చలేకపోయారు. దాంతో వారు దాన్ని అక్కడే విడిచిపెట్టి, ఉన్న ఒక్క రాతితోనే నగరానికి చేరుకున్నారు.శిల్పులు ఆ మొదటి రాతితో అందమైన విగ్రహాలు చెక్కారు. శిల్పుల ఉలి దెబ్బలను నిగ్రహంతో భరించి విగ్రహాలుగా మారిన ఆ రాతిని ఊరి ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆరాధించారు. నగరంలోకి రానని భీష్మించుకుని ఉండిపోయిన రెండోరాయి అడవిలోనే ఉండి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ్త అక్కడే ఎల్లకాలమూ మిగిలిపోయింది. (జెన్ కథ) -
భారీ శాంటాక్లాజ్
భువనేశ్వర్ / పూరీ: ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంటాక్లాజ్ సైకత శిల్పాన్ని ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ‘ప్రపంచ శాంతి’ సందేశంతో ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో 25 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో శాంటా ముఖాన్ని తయారుచేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం రూపొందించిన ఈ శిల్పం కోసం 600 టన్నుల ఇసుకను వాడినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. -
18 గంటల్లో గోపుర నిర్మాణం
నంద్యాల: స్ఫటికలింగ శివాలయం గోపుర నిర్మాణాన్ని 18 గంటల్లో పూర్తిచేసి శిల్పులు రికార్డు నెలకొల్పారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎన్జీవో కాలనీ హౌసింగ్ బోర్డులో అమరయోగ వికాస కేంద్ర ఆవరణలో యోగాచార్య పాములేటి స్వామి స్ఫటిక లింగంతో శివాలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయాన్ని మొత్తం 48 గంటల్లో పూర్తిచేయాలని శిల్పి అన్నయ్య ఆచారి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పదిరోజుల కిందట 12 గంటల్లో స్ఫటికలింగ శివాలయాన్ని పూర్తిచేశారు. శుక్ర, శనివారాల్లో గోపుర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయంపై 12 అడుగుల ఎత్తు గోపుర నిర్మాణ పనుల్ని శుక్రవారం 12 గంటలు, శనివారం ఆరుగంటలు పనిచేసి పూర్తిచేశారు. మొత్తం 18 గంటల్లో గోపుర నిర్మాణం పూర్తిచేసి రికార్డు నెలకొల్పామని శిల్పి అన్నయ్య ఆచారి పేర్కొన్నారు.