కళవాయి శివమ్మ
దళవాయి శివమ్మ... తోలుబొమ్మల చిత్రకారిణి. తోలు మీద అపురూప చిత్రాలను గీస్తూ ‘శిల్పగురు’ జాతీయ పురస్కారానికి ఎంపికైన తెలుగు మహిళ శివమ్మ.
దళవాయి శివమ్మది ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మల కుంట గ్రామం. తోలుబొమ్మలపై అద్భుతమైన చిత్రాలను సృజనాత్మకంగా చిత్రీకరిస్తోంది. శ్రీకృష్ణ చరిత్ర, విశ్వరూప హనుమ ఘట్టాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారులకు అందించే శిల్పగురు అవార్డుకు ఈ ఏడాది శివమ్మను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక మహిళ ఆమె. కేంద్ర చేనేత, జౌళి, హస్త కళల శాఖ ఆమెకు శిల్పగురు అవార్డును ప్రకటించింది. ఈమె ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ అవార్డు ప్రధానం చేసింది.
తోలుబొమ్మల తయారీ దళవాయి శివమ్మ కుటుంబవృత్తి. భర్త ్ర΄ోత్సాహంతో ఆమె తోలుబొమ్మలను తయారు చేయడంలో నైపుణ్యాన్ని సాధించారు.. తాతముత్తాతల కాలం నాటినుండి వారికి ఈ కళపై పట్టు ఉండటంతో మారుతున్న ఫ్యాషన్ ΄ోటీ ప్రపంచానికి ధీటుగా వైవిధ్యమైన బొమ్మలను చిత్రిస్తున్నారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న ల్యాంప్‌సెట్‌లు, పెయింటింగ్స్, డోర్‌హ్యాంగర్స్, రామాయణ ఘట్టాలు, సుందరకాండ, శ్రీకృష్ణలీలలు, విశ్వరూప హనుమల ఘట్టాలు ్ర΄ాచుర్యం ΄÷ందాయి.
విదేశాల్లో మన బొమ్మలు
శివమ్మ తయారు చేస్తున్న తోలుబొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో΄ాటు యూరప్, అమెరికా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ కళ తనతో ΄ాటే అంతరించి ΄ోకుండా నాలుగు తరాల ΄ాటు కొనసాగాలని ఆమె ఆకాంక్ష. అందుకోసం కొత్తతరానికి శిక్షణ ఇస్తోంది. గ్రామీణ మహిళలకు ఉ΄ాధిని కల్పిస్తోంది. ఈ తోలుబొమ్మలను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. దళవాయి శివమ్మ కుమారుడు కుళ్లాయప్ప తోలుబొమ్మల తయారీలో జాతీయ స్థాయి అవార్డులు, వియత్నాం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వీరి కుటుంబం ఎంతో మంది కళాకారులకు ప్రేరణగా నిలుస్తోంది.
ఇది కళకు దక్కిన గౌరవం
కేంద్ర ప్రభుత్వం తనకు శిల్పగురు అవార్డును ప్రకటించడం యావత్ హస్తకళలకు, కళాకారులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. వందల యేళ్లనాటి పురాతన కళ అయిన తోలుబొమ్మలను తాతల కాలం నుండి తయారు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో తమ ఉత్పత్తులకు ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉంది. మా కళ అంతరించి ΄ోకుండా ఎంతో మందికి నేర్పాలన్నదే నా జీవిత లక్ష్యం.
– దళవాయి శివమ్మ, తోలుబొమ్మల చిత్రకారిణి, జాతీయ అవార్డు గ్రహీత
– కొత్త విజయ్‌భాస్కర్‌రెడ్డి,
సాక్షి, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment