shivamma
-
Dalavai Shivamma: అమ్మ గీసిన బొమ్మ
దళవాయి శివమ్మ... తోలుబొమ్మల చిత్రకారిణి. తోలు మీద అపురూప చిత్రాలను గీస్తూ ‘శిల్పగురు’ జాతీయ పురస్కారానికి ఎంపికైన తెలుగు మహిళ శివమ్మ.దళవాయి శివమ్మది ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మల కుంట గ్రామం. తోలుబొమ్మలపై అద్భుతమైన చిత్రాలను సృజనాత్మకంగా చిత్రీకరిస్తోంది. శ్రీకృష్ణ చరిత్ర, విశ్వరూప హనుమ ఘట్టాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారులకు అందించే శిల్పగురు అవార్డుకు ఈ ఏడాది శివమ్మను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక మహిళ ఆమె. కేంద్ర చేనేత, జౌళి, హస్త కళల శాఖ ఆమెకు శిల్పగురు అవార్డును ప్రకటించింది. ఈమె ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ అవార్డు ప్రధానం చేసింది.తోలుబొమ్మల తయారీ దళవాయి శివమ్మ కుటుంబవృత్తి. భర్త ్ర΄ోత్సాహంతో ఆమె తోలుబొమ్మలను తయారు చేయడంలో నైపుణ్యాన్ని సాధించారు.. తాతముత్తాతల కాలం నాటినుండి వారికి ఈ కళపై పట్టు ఉండటంతో మారుతున్న ఫ్యాషన్ ΄ోటీ ప్రపంచానికి ధీటుగా వైవిధ్యమైన బొమ్మలను చిత్రిస్తున్నారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న ల్యాంప్సెట్లు, పెయింటింగ్స్, డోర్హ్యాంగర్స్, రామాయణ ఘట్టాలు, సుందరకాండ, శ్రీకృష్ణలీలలు, విశ్వరూప హనుమల ఘట్టాలు ్ర΄ాచుర్యం ΄÷ందాయి.విదేశాల్లో మన బొమ్మలుశివమ్మ తయారు చేస్తున్న తోలుబొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో΄ాటు యూరప్, అమెరికా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ కళ తనతో ΄ాటే అంతరించి ΄ోకుండా నాలుగు తరాల ΄ాటు కొనసాగాలని ఆమె ఆకాంక్ష. అందుకోసం కొత్తతరానికి శిక్షణ ఇస్తోంది. గ్రామీణ మహిళలకు ఉ΄ాధిని కల్పిస్తోంది. ఈ తోలుబొమ్మలను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. దళవాయి శివమ్మ కుమారుడు కుళ్లాయప్ప తోలుబొమ్మల తయారీలో జాతీయ స్థాయి అవార్డులు, వియత్నాం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వీరి కుటుంబం ఎంతో మంది కళాకారులకు ప్రేరణగా నిలుస్తోంది. ఇది కళకు దక్కిన గౌరవంకేంద్ర ప్రభుత్వం తనకు శిల్పగురు అవార్డును ప్రకటించడం యావత్ హస్తకళలకు, కళాకారులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. వందల యేళ్లనాటి పురాతన కళ అయిన తోలుబొమ్మలను తాతల కాలం నుండి తయారు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో తమ ఉత్పత్తులకు ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉంది. మా కళ అంతరించి ΄ోకుండా ఎంతో మందికి నేర్పాలన్నదే నా జీవిత లక్ష్యం. – దళవాయి శివమ్మ, తోలుబొమ్మల చిత్రకారిణి, జాతీయ అవార్డు గ్రహీత – కొత్త విజయ్‌భాస్కర్‌రెడ్డి, సాక్షి, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా -
కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మన మూవీస్
-
Cannes Film Festival: గోస్ టు కాన్స్
పేదరికంతో ఇబ్బందులు పడే ఒక మహిళ కథ.. ఓ బాలుడి తీయని జ్ఞాపకాలు.. భారతీయ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాద బాధితుల ఇబ్బందులు.. ఇంటి కోసం వెతికే ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళల పాట్లు.. ఒక జర్నలిస్ట్ మరియు రెండు వర్గాల మధ్య సంఘర్షణ.. ఇవన్నీ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కథలతో రూపొందిన ఐదు భారతీయ చిత్రాలు కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ‘గోస్ టు కాన్స్’ విభాగంలో ప్రదర్శితం కానున్నాయి. ఈ నెల 17 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కాన్స్ ఉత్సవాలకు వెళ్లనున్న ఆ ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం. లైలా... రోషిణి... ఓ ఇల్లు జీవించడానికి ఒక ఇంటి కోసం ఆరాటపడుతుంటారు లైలా, రోషిణి అనే ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారు కావడంతో అద్దెకు ఇల్లు దక్కించుకోవడం పెద్ద ప్రహసనం అవుతుంది. రిన్ చిన్, మహీన్ మీర్జా రూపొందించిన హిందీ చిత్రం ‘ఏక్ జగహ్ అప్నీ’ కథ ఇది. నిజమైన ఇద్దరు ట్రాన్స్ ఉమెన్ (లింగ మార్పిడి చేయించుకున్న మహిళలు) నటించిన చిత్రం ఇది. ఇద్దరికీ కూడా ఇది తొలి సినిమానే. కథ రాసేటప్పుడు వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఓ బాలుడి జ్ఞాపకాలు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో చదువుకుంటాడు ఆ కుర్రాడు. ఆ నాలుగేళ్ల జీవితం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ జ్ఞాపకాలకు కొన్ని కాల్పనిక అంశాలు జోడించి దర్శకుడు శైలేంద్ర సాహు తెరకెక్కించిన చిత్రం ‘బైలాడీలా’. శైలేంద్ర సాహు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఛత్తీస్ గఢ్‌లో చదువుకున్నప్పటి అతని జ్ఞాపకాలే ఈ సినిమా. హిందీ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి బడ్జెట్ నిర్ణయించలేదు. శేలైంద్ర స్నేహితులు నటించారు. వాళ్లతో పాటు టెక్నీషియన్లు ఎవరూ పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా ద్వారా డబ్బులొస్తే అప్పుడు ఇస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చారు శైలేంద్ర. కాన్స్ చిత్రోత్సవాల్లో తన చిత్రాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఆకాంక్షతో అక్కడికి వెళుతున్నారు. నిర్మాతలు ముందుకు రాని ‘ఫాలోయర్’ బెల్గామ్‌లోని ఓ పట్టణానికి చెందిన ఒక జర్నలిస్ట్, రెండు వర్గాల మధ్య సంఘర్షణ చుట్టూ సాగే చిత్రం ‘ఫాలోయర్’. హర్షద్ నలవాడే దర్శకత్వంలో హిందీ, కన్నడ, మరాఠీ, దఖినీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. బెల్గామ్ నేపథ్యం కావడంతో అక్కడి స్థానికులతోనే నటింపజేశారు. రెండు వర్గాల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని సినిమా కావడంతో నిర్మాతలెవరూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సినిమా టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసి ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అలా ‘క్రౌడ్ ఫండెడ్’ మూవీగా ‘ఫాలోయర్’ రూపొందింది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చేస్తున్న సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇద్దరు నిర్మాతలు సహాయం చేయడంతో ఈ సినిమా పూర్తయింది. పేదరికాన్ని జయించాలని... ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్నం భోజనం అందించే వంట మనిషి శివమ్మ జీవితం చుట్టూ సాగే కథ ‘శివమ్మ’ చిత్రం. పేదరికాన్ని జయించడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కూతురి పెళ్లికి దాచిన డబ్బుని ఓ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతుంది. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలను జోడించి అల్లిన కాల్పనిక కథతో దర్శకుడు జై శంకర్ ఈ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించినవారందరూ వృత్తిరీత్యా యాక్టర్లు కాదు. కానీ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండాలని నటింపజేశారు. దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాగ్జాన్ 2020లో అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదంగా నమోదైంది. గ్యాస్ లీకేజ్ కారణంగా చమురు బావిలో ఎగసిపడిన భారీ మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఈ ఘటన నేపథ్యంలో రూపొందిన అస్సామీ చిత్రం ‘బాగ్జాన్’. తిన్సుకియాలో నిజమైన లొకేషన్లలో చిత్రీకరించారు. అలాగే ఆ దుర్ఘటన బాధితులను కూడా నటింపజేశారు చిత్రదర్శకుడు జైచెంగ్ గ్జయ్. బలమైన కథాంశంతో రూపొందిన ఈ ఐదు చిత్రాలూ ప్రపంచ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయని ఊహించవచ్చు. ఇలా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం ఆయా చిత్రబృందాలకు ఉపయోగపడే విషయం. తమ సినిమాని మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. అలాగే తదుపరి చిత్రానికి ఫండ్ సమకూరే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికి సినిమా విడుదల కాకపోతే విడుదలకు సహాయం అందే అవకాశం ఉంది. మేకర్స్‌కి ఇలాంటి ప్రయోజనాలు ఉంటే.. నటీనటులకు అవకాశాలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అందుకే కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్లనున్న ఈ ఐదు చిత్రాల యూనిట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆయనే లోకం!
దేవుని సాక్షిగా ముడిపడిన ఆ బంధం.. చెరిగిపోని జ్ఞాపకాలకు వేదికగా నిలిచింది. సుఖ దుఃఖాలను కలిసి పంచుకుని.. కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచారు. చేతిలో చెయ్యేసి.. అడుగులో అడుగేసి.. సాగించిన వీరి పయనం ‘కడదాకా’ కలిసే సాగింది. అనారోగ్యం ఆయన ఊపిరి తీస్తే.. భర్త లేని లోకం శూన్యమని ఆమె కూడా తనువు చాలించింది. 24 గంటల వ్యవధిలో భార్యాభర్తల మరణంతో ఉయ్యాలవాడ మూగబోయింది. ఉయ్యాలవాడ(ఓర్వకల్లు): ఊరంతా కన్నీటి సంద్రమైంది. గంటల వ్యవధిలో దంపతుల హఠాన్మరణం అందరినీ కదిలించింది. అయ్యో.. అని బాధపడుతూనే, చావు కూడా విడదీయలేని ఆ బంధం ఎన్నెన్ని జన్మలదోనని కీర్తించారు. ఈ ఘటన మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం దేవానందం(78), శివమ్మ(75) దంపతులకు కూలీ పనులే ఆధారం. ఇరువురు సంతానం కాగా.. రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరినీ ఓ ఇంటి వాళ్లను చేశారు. పెద్ద కొడుకు ఏసయ్య స్వగ్రామంలోనే కూలీ పనులు చేస్తుండగా.. చిన్న కొడుకు దానమయ్య కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇక శేష జీవితం సంతోషంగా గడిపే క్రమంలో చిన్న కుమారుని వద్దే ఉండిపోయారు. నాలుగు రోజుల క్రితం దేవానందం స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కోలుకోలేక సోమవారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస వదిలాడు. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు చివరి చూపునకు వస్తున్న తరుణంలో మంగళవారం ఉదయం శివమ్మ కూడా భర్తనే అనుసరించింది. ఆయన మృతదేహం వద్దే ప్రాణం విడవటం చూసి స్థానికుల హృదయం బరువెక్కింది. ఈ విషాదం తెలిసి గ్రామస్తులంతా ఆ ఇంటి వద్ద చేరి కన్నీళ్లతో నివాళులర్పించారు. మధ్యాహ్నానికి కుటుంబ సభ్యులు, స్థానిక సీఎస్ఐ పెద్దల ఆధ్వర్యంలో క్రైస్తవ మత సాంప్రదాయంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.