భువనేశ్వర్ / పూరీ: ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంటాక్లాజ్ సైకత శిల్పాన్ని ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ‘ప్రపంచ శాంతి’ సందేశంతో ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో 25 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో శాంటా ముఖాన్ని తయారుచేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం రూపొందించిన ఈ శిల్పం కోసం 600 టన్నుల ఇసుకను వాడినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment