limka book of records
-
JK Cements: ఇది కదా రికార్డ్ అంటే..
ప్రముఖ సిమెంట్ కంపెనీలలో ఒకటైన జేకే సిమెంట్స్ (JK Cements) ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కేవలం ఒకేరోజులో రాజస్థాన్‌లోని 249 పాఠశాలల్లో 249 ర్యాంప్‌లను నిర్మించడం వల్ల ఈ ఘనత దగ్గింది. రండి ప్రతీ మార్గాన్ని సులభతరం చేద్దాం (Banaye Har Raah Aasaan)’ అనే కార్యక్రమం ద్వారా జేకే సిమెంట్స్ 249 ర్యాంప్‌లను నిర్మించింది. ఇందులో సంస్థ ఉద్యోగులు, డీలర్స్, కాంట్రాక్టర్లు, కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ హెడ్ లవ్ రాఘవ్ తెలిపారు. ఈ సందర్భంగా రాఘవ్ మాట్లాడుతూ.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజానికి మనవంతు తప్పనిసరిగా సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంగా ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే అని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..) రాజస్థాన్‌లో నిర్మించిన 249 ర్యాంప్‌లు జేకే సిమెంట్స్ నిర్వహించింది. ఇందులో ఇతర సంస్థలు, ప్రభుత్వ విభాగాల జోక్యం లేదని కూడా ఈ సందర్భంగా జేకే సిమెంట్స్ క్లస్టర్ హెడ్ హరీశ్ ఖుషలని తెలిపారు. సుమారు రెండు వేలమంది కార్మికుల సహకారంతో ఇది విజయవంతమైందని కూడా వెల్లడించారు. -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో 17.4 ఫీట్ల జొన్న మొక్క
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పెద్ద జొన్న మొక్కకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఎన్టీపీసీ రామగుండం జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన దొడ్డ రాంచెంద్రారెడ్డి–పార్వతి దంపతులు తమ ఇంటి ఆవరణలో జొన్న మొక్కను పెంచారు. అది కాస్తా 5.3 మీటర్ల ఎత్తు(17.4 ఫీట్ల ఎత్తు) పెరగడంతో 2018, ఆక్టోబర్ 16న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పెద్దగా మొక్క పెరగడంతో పూర్తి వివరాలతో రాంచంద్రారెడ్డి దంపతులు లిమ్కా బుక్ రికార్డుకు పంపించారు. అవార్డు ఎంపిక పరిశీలన అనంతరం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఎత్తయిన జొన్న మొక్కగా గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి వారికి ప్రశంసాపత్రాన్ని పంపించారు. తమ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్క లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: పిట్టల్లా రాలిన జనం: పిడుగులతో 6 మంది దుర్మరణం -
బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు
ఆదోని: బూడిదతో బాపూ బొమ్మను అత్యంత సహజంగా చిత్రీకరించిన ఆదోని యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. అతని ప్రతిభను అత్యుత్తమంగా గుర్తించిన ముంబై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ 2021 రికార్డుల జాబితాలో చోటు కల్పించింది. కరోనా నిబంధనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్లో పంపి సత్కరించింది. ఆదోని పట్టణం, నారాయణ గుంతకు చెందిన లక్ష్మీ, పద్మనాభం దంపతుల రెండో సంతానం శ్రీకాంత్ ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. కళాఖండాలను సృష్టించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. తాజాగా ఈ నెల 4న కాగితాన్ని కాల్చగా వచ్చిన బూడిదలో తన చేతి మునివేళ్లను అద్ది తెల్ల కాగితంపై బాపూ (మహాత్మా గాంధీ) బొమ్మను అపురూపంగా తీర్చిదిద్దారు. కాగితం కాల్చి బూడిద చేయడం నుంచి బొమ్మ పూర్తిగా చిత్రీకరించే వరకు వీడియో రికార్డు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు పంపారు. రికార్డును పరిశీలించిన ఆ సంస్థ ప్యానల్ కమిటీ 2021– 22లో అత్యుత్తమ ఆర్ట్‌గా గుర్తించింది. అతన్ని గౌరవిస్తూ కరోనా నిబంధనల దృష్ట్యా గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్లో పంపింది. బుధవారం రాత్రి కొరియర్ అందుకున్న శ్రీవైష్ణవ శ్రీకాంత్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాను సరికొత్త ప్రయోగంతో చిత్రీకరించిన బాపు బొమ్మ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిపెట్టడం ఆనందం కలిగించిందన్నాడు. -
నేను ఎన్నికల్లో గెలిస్తే, నాకు గుండె నొప్పే...
సాక్షి, చెన్నై: భారత ఉపఖండంపై 17 సార్లు దండయాత్ర చేసిన గజనీ మహ్మద్‌ను గుర్తు చేస్తున్నాడో తమిళ తంబి. బంగారంపై ఆశతో గజనీ భారత్‌పై పట్టు వదలని విక్రమార్కుడిలా దాడి చేయగా.. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ మాత్రం ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ మళ్లీ పోటీ చేస్తునే ఉన్నాడు. తమిళనాడులోని సాలెం జిల్లాకు చెందిన పద్మరాజన్, మహామహులనదగ్గ నాయకులు బరిలో నిలిచే స్థానాల్లో పోటీ చేస్తుంటాడు. 1988 నుంచి ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పద్మరాజన్ పోటీ చేశాడు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతీసారి ఓటమిపాలైన నేతగా అతడికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం కొసమెరుపు. పద్మరాజన్ను అందరూ ముద్దుగా ఎలక్షన్ కింగ్ అని పిలుస్తుంటారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, తమిళనాడు మాజీ సీఎంలు పురుచ్చితలైవి జయలలిత, కరుణానిధి, మాజీ రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, డీఎండీకే చీఫ్ విజయ్కాంత్తోపాటు ఇలా చాలామంది ప్రముఖులతో పద్మరాజన్ పోటీ పడటం విశేషం. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరిగిన అనేక ఎన్నికల్లో పద్మరాజన్ పోటీపడ్డారు. 1988 నుంచి 2016 వరకు చాలా ఎన్నికల్లో పోటీపడిన అతడు, మొత్తం 178 ఓటములను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకవేళ మీరు విజయం సాధిస్తే ఎలా సెలబ్రేట్ జరుపుకుంటాని అడిగితే.. ‘నేను ఎన్నికల్లో గెలిస్తే, నాకు గుండె నొప్పి రావడం ఖాయమ’ని అని పద్మరాజన్ చమత్కరిస్తుంటాడు. ప్రజల్లో చెతన్యం తీసుకురావడంతోపాటు రికార్డులను నెలకొల్పడమే తన ధ్యేయమంటూ సాగుతున్నాడీ గెలుపెరుగని యోధుడు. వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుడైన పద్మరాజన్ తన కష్టంతో సంపాదించిన డబ్బులతోనే ఎన్నికల్లో పాల్గొంటున్నానని తెలిపాడు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పద్మరాజన్ తమిళనాడులోని ధర్మపురి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా, పట్టలి మక్కల్ కచ్చి నాయకుడు అన్బుమని రామదాస్‌తో పోటీకి సై అంటున్నారు. ఒకవేళ రాహుళ్ గాంధీ కాసర్గాడ్ నుంచి కాకుండా వయానాద్ నుంచి పోటీ చేస్తే, ఆయనకు పోటీగా తానూ అక్కడి బరిలో నిలుస్తానని, త్వరలోనే తన ఓటములతో డబుల్ సెంచరీ చేయడం ఖాయమని నవ్వుతూ చెప్పాడీ రికార్డుల రాజన్. -
షాకీర్ ది గ్రేట్..!
ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపించారు ఐరాలకు చెందిన షాకీర్ అహ్మద్. పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించారు. అందరి చేత శెభాష్ అనిపించుకుంటూ షాకీర్ ది గ్రేట్ అని మన్ననలందుకుంటున్నారు. చిత్తూరు, రొంపిచెర్ల : ఐరాలకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్, రహిమాబేగంలకు నలుగురు కుమారులు. వీరి నాలుగో సంతానం షాకీర్ అహ్మ ద్ పుట్టుకతోనే అంధుడు. కంటిచూపు కోసం కంటిచూపు కోసం ఎంతోమంది నేత్ర వైద్యులను కలసినా ఫలితం లేకపోయింది. అంధత్వం అనే లోపం ఉందని విచారిస్తూ కూర్చోక స్వయంకృషి, ఆత్మస్థైర్యంతో రికార్డులు సృష్టిస్తూ, అవార్డులను సొంతం చేసుకుంటున్నారు షాకీర్. తన కంటికి దక్కని వెలుగును ప్రస్తుతం ఇతరుల జీవితాల్లోనూ నింపుతున్నారు. విద్యాభ్యాసం.. షాకీర్ ఐదో తరగతి వరకు చెన్నై లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో, ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు నెల్లూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్ (అంధేతరుల పాఠశాల)లో చదువుకున్నారు. అలాగే ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ తిరుపతిలోని ఎస్వీ ఆర్డ్స్ కాలేజి, ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఉద్యోగ ప్రస్థానం.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎంబీఏ చదివిన మొట్టమొదటి అంధత్వ విద్యార్థిగా షాకీర్ నిలిచారు. కొద్దిరోజులు నెల్లూరులోని ఏవీఎస్ కాలేజి, విజయవాడలోని నిమ్రా కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సమాజంలో తన స్వశక్తితో నిలబడాలనే ఉద్దేశంతో హైదరాబాదులో ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్స్ అనే సంస్థను స్థాపించారు. దేశమంతటా పర్యటిస్తూ మేనేజ్మెంట్ ట్రైనర్‌గా శిక్షణ ఇస్తూ సక్సెస్ కోచ్‌గా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ సంస్థలైన మిట్సుబుషి, ఎసెండాస్, బజాజ్ అలయెంజ్, మెట్ లైఫ్ ఇస్సూరెన్స్ లాంటి సంస్థల్లోని ఉద్యోగులకు గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, లీడర్ షిప్, టీం బిల్డింగ్ మొదలైన అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. జ్ఞాపకశక్తిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజెప్పడంలోను, విద్యార్థులు, ఉద్యోగులు తమ ఆశయాలను ఎలా నేరవేర్చుకోవాలో వివరిస్తూ ఉత్తేజభరితమైన ప్రసంగాలు ఇవ్వడంలోనూ షాకీర్ సిద్ధహస్తుడు. కుటుంబం.. షాకీర్ అహ్మద్ రొంపిచెర్లకు చెందిన హజీరా కుమారై షబానాను నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు అహిల్(2) ఉన్నాడు. అతని తల్లిదండ్రులు తిరుపతిలో ఉండగా, వీరు ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు. సాధించిన అవార్డులు ♦ 2001 జనవరిలో ఖురాన్ గ్రంథాన్ని బ్రెయిలీ లిపిలో రాయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ♦ 2007 ఫిబ్రవరి 1న లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. ♦ 2008లో జూన్ 27న ఆంధ్రామేధావి అవార్డును తెనాలి విజ్ణానవేదిక వారు అందజేశారు. ♦ 2011 సెప్టెంబరు 30న లతారాజా ఫౌండేషన్ నుంచి గార్డియన్ ఆఫ్ గుడ్‌విల్ అవార్డు పొందారు. ♦ 2017 డిసెంబరు 9న పశ్చిమగోదావరి జిల్లా వేలూరులో అక్కినేని అంతర్జాతీయ వినూత్నరత్న అవార్డును అందుకున్నారు. -
భారీ శాంటాక్లాజ్
భువనేశ్వర్ / పూరీ: ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంటాక్లాజ్ సైకత శిల్పాన్ని ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ‘ప్రపంచ శాంతి’ సందేశంతో ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో 25 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో శాంటా ముఖాన్ని తయారుచేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం రూపొందించిన ఈ శిల్పం కోసం 600 టన్నుల ఇసుకను వాడినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. -
‘లిమ్కా బుక్’లో నారాయణ వైద్యురాలు
-
‘లిమ్కా బుక్’లో నారాయణ వైద్యురాలు
నెల్లూరు: నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన మరుగుజ్జు మహిళ కామాక్షి (ఎత్తు 108 సెంటీమీటర్లు)కి తమ ఆస్పత్రిలో డాక్టర్ కలికి హైమావతి విజయవంతంగా కాన్పు చేశారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ సుబ్రమణ్యం చెప్పారు. ఇందుకుగాను డాక్టర్ హైమావతికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించిందని తెలిపారు. నారాయణ వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమెను హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజ్ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా డా.హైమావతి మాట్లాడుతూ మరుగుజ్జు మహిళల గర్భసంచి చిన్నగా ఉండటంతో వారు గర్భం దాల్చడం అరుదుగా జరుగుతుందన్నారు.