అవార్డుతో రాంచెంద్రారెడ్డి–పార్వతి దంపతులు
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పెద్ద జొన్న మొక్కకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఎన్టీపీసీ రామగుండం జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన దొడ్డ రాంచెంద్రారెడ్డి–పార్వతి దంపతులు తమ ఇంటి ఆవరణలో జొన్న మొక్కను పెంచారు. అది కాస్తా 5.3 మీటర్ల ఎత్తు(17.4 ఫీట్ల ఎత్తు) పెరగడంతో 2018, ఆక్టోబర్ 16న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
పెద్దగా మొక్క పెరగడంతో పూర్తి వివరాలతో రాంచంద్రారెడ్డి దంపతులు లిమ్కా బుక్ రికార్డుకు పంపించారు. అవార్డు ఎంపిక పరిశీలన అనంతరం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఎత్తయిన జొన్న మొక్కగా గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి వారికి ప్రశంసాపత్రాన్ని పంపించారు. తమ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్క లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment