ntpc ramagundam
-
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో 17.4 ఫీట్ల జొన్న మొక్క
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పెద్ద జొన్న మొక్కకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఎన్టీపీసీ రామగుండం జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన దొడ్డ రాంచెంద్రారెడ్డి–పార్వతి దంపతులు తమ ఇంటి ఆవరణలో జొన్న మొక్కను పెంచారు. అది కాస్తా 5.3 మీటర్ల ఎత్తు(17.4 ఫీట్ల ఎత్తు) పెరగడంతో 2018, ఆక్టోబర్ 16న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పెద్దగా మొక్క పెరగడంతో పూర్తి వివరాలతో రాంచంద్రారెడ్డి దంపతులు లిమ్కా బుక్ రికార్డుకు పంపించారు. అవార్డు ఎంపిక పరిశీలన అనంతరం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఎత్తయిన జొన్న మొక్కగా గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి వారికి ప్రశంసాపత్రాన్ని పంపించారు. తమ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్క లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: పిట్టల్లా రాలిన జనం: పిడుగులతో 6 మంది దుర్మరణం -
ఎన్టీపీసీ రామగుండం రికార్డు
జ్యోతినగర్(కరీంనగర్): ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ సంస్థ బుధవారం రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసింది. 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో నిన్న ఒకే రోజు 64.401 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో గతంలో ఎన్టీపీసీ పేరిట ఉన్న 64,395 మెగావాట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు(29.03.2009) 64,395 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా.. స్వల్ప పెరుగుదలతో రికార్డుల్లోకి ఎక్కిందని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. -
రామగుండం సమీప ప్రాంతాల అభివృద్ధికి ఎన్టీపీసీ చేయూత
రామగుండం(కరీంనగర్): ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే సమీప గ్రామాల అభివృద్ధికి చేయూనందిస్తామని సంస్థ డెరైక్టర్ కె.కె.శర్మ అన్నారు. రామగుండం విద్యుత్ ప్రాజెక్టును బుధవారం శర్మ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు వై.వి.రావు, ఆర్.కె.శ్రీవాస్తవ, ఆర్.వెంకటేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు
ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీవాస్తవ గోదావరిఖని: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నామని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్కే శ్రీవాస్తవ వెల్లడించారు. రామగుండంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటగా ‘తెలంగాణ ఫేజ్-1’ కింద రామగుండంలో 800 మెగావాట్ల రెండు యూనిట్ల (1,600 మెగావాట్లు) నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ‘తెలంగాణ ఫేజ్-2’ కింద చేపట్టనున్న 800 మెగావాట్ల 3 యూనిట్ల (2,400 మెగావాట్లు) నిర్మాణానికి వెయ్యి ఎకరాల స్థలం అవసరమన్నారు. బీపీఎల్‌కు ఇచ్చిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. ఫేజ్-2 యూనిట్లకు 8 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉండగా... గతంలో రామగుండం వద్ద బీపీఎల్ విద్యుత్ కేంద్రానికి కేటాయించిన 3.5 మిలియన్ టన్నుల బొగ్గును ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు. ప్రతిపాదిత 4వేల మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం తెలంగాణకే కేటాయింపులు జరుగుతాయని శ్రీవాస్తవ తెలిపారు. హోంస్టేట్ (స్వరాష్ట్రం)లో ప్లాంట్ ఉన్నందున 50 శాతం విద్యుత్ కేటాయిస్తారని, కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున 85 శాతం విద్యుత్ కేటాయించే అవకాశం ఉందన్నారు. ఇంకా ఎవరికీ కేటాయించిన గ్రిడ్‌కు అనుసంధానం చేసే 15 శాతం విద్యుత్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. -
రామగుండం ఎన్టీపీసీలో కొత్త యూనిట్లు
23, 27న శంకుస్థాపన గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన 8, 9 యూనిట్ల పనులకు ఈ నెల 23, 27 తేదీల్లో శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీపీసీ పరిధిలోని పాత పీ.కే.రామయ్య కాలనీలో యూనిట్లకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేశారు. శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరువుతారని అనుకున్నప్పటికీ ఆయన రాకపై అనుమానాలు ఉన్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్టీపీసీ సీఅండ్ఎండీ అరూప్‌రాయ్‌చౌదరిలు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్టీపీసీ టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతున్నారు.