ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీవాస్తవ
గోదావరిఖని: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నామని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్కే శ్రీవాస్తవ వెల్లడించారు. రామగుండంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటగా ‘తెలంగాణ ఫేజ్-1’ కింద రామగుండంలో 800 మెగావాట్ల రెండు యూనిట్ల (1,600 మెగావాట్లు) నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ‘తెలంగాణ ఫేజ్-2’ కింద చేపట్టనున్న 800 మెగావాట్ల 3 యూనిట్ల (2,400 మెగావాట్లు) నిర్మాణానికి వెయ్యి ఎకరాల స్థలం అవసరమన్నారు.
బీపీఎల్‌కు ఇచ్చిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. ఫేజ్-2 యూనిట్లకు 8 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉండగా... గతంలో రామగుండం వద్ద బీపీఎల్ విద్యుత్ కేంద్రానికి కేటాయించిన 3.5 మిలియన్ టన్నుల బొగ్గును ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు. ప్రతిపాదిత 4వేల మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం తెలంగాణకే కేటాయింపులు జరుగుతాయని శ్రీవాస్తవ తెలిపారు. హోంస్టేట్ (స్వరాష్ట్రం)లో ప్లాంట్ ఉన్నందున 50 శాతం విద్యుత్ కేటాయిస్తారని, కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున 85 శాతం విద్యుత్ కేటాయించే అవకాశం ఉందన్నారు. ఇంకా ఎవరికీ కేటాయించిన గ్రిడ్‌కు అనుసంధానం చేసే 15 శాతం విద్యుత్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు
Published Sat, Nov 22 2014 1:43 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement