
‘లిమ్కా బుక్’లో నారాయణ వైద్యురాలు
నెల్లూరు: నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన మరుగుజ్జు మహిళ కామాక్షి (ఎత్తు 108 సెంటీమీటర్లు)కి తమ ఆస్పత్రిలో డాక్టర్ కలికి హైమావతి విజయవంతంగా కాన్పు చేశారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ సుబ్రమణ్యం చెప్పారు. ఇందుకుగాను డాక్టర్ హైమావతికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించిందని తెలిపారు.
నారాయణ వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమెను హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజ్ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా డా.హైమావతి మాట్లాడుతూ మరుగుజ్జు మహిళల గర్భసంచి చిన్నగా ఉండటంతో వారు గర్భం దాల్చడం అరుదుగా జరుగుతుందన్నారు.