hymavathi
-
Organic Farming: నలభై ఎకరాల భూమి.. ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...
బాధ్యతల బరువు దించుకున్నాక సామాన్యుల కోసం ఏమైనా చేయగలనా అనుకుంది. సొంత లాభం కొంతమానుకుని నలుగురికి ఉపయోగపడాలని అనుకున్న ఆలోచన ఆమెను వ్యవసాయం దిశగా నడిపించింది. ప్రకృతి సేద్యంతో పదిమందికి చేయూతనిస్తూ తన జీవనాన్ని అర్థవంతంగా మార్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కొల్లావారిపల్లెకు చెందిన శవన హైమావతి. ఆరోగ్యసిరిగా అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. కొడుకు, కూతురు విదేశాలలో స్థిరపడ్డారు. చిన్నకొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త మరణం తర్వాత ఒంటరి జీవితం ఆమెను వ్యవసాయం వైపు దృష్టి మళ్లించేలా చేసింది. వారసత్వంగా ఉన్న భూమిని తనే స్వయంగా సాగులోకి తీసుకురావాలనుకుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తన ద్వారా తన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంది. పదిహేనేళ్లుగా ప్రకృతిసేద్యంతో పంటసిరులను కురిపిస్తోంది హైమావతి. ప్రయోగాలతో సేద్యం... హైమావతి కుటుంబానికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి నలభై ఎకరాలు ఉంది. అందులో మొదట్లో కొద్దిపాటి భూమిని స్వయంగా సేద్యం చేసుకుంటూ, ప్రకృతి సేద్యంపట్ల అవగాహన కల్పించుకుంటూ చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చింది. పదిహేనేళ్లుగా చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు 34 ఎకరాలకు విస్తరించింది. సుభాష్ పాలేకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమావేశాలకు హాజరవుతూ, వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ప్రకృతిసేద్యంలో పూర్తి నైపుణ్యం సాధించింది. రసాయనాలు వాడకుండా ఎరువులు మొదలుకొని పురుగు మందుల వరకు అన్నీ సొంతంగా తయారు చేస్తుంది. స్వయంగా ఎరువుల తయారీ... స్కూల్ చదువు దగ్గరే ఆగిపోయిన హైమావతి ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో ఎంతోమందికి సలహాలు ఇచ్చేంతగా ఎదిగింది. ఎరువుల కోసం పాడి ఆవుల పెంపకాన్ని చేపట్టింది. పురుగులు, తెగుళ్లను నివారించేందుకు స్వయంగా మిశ్రమాలను తయారుచేస్తూ చుట్టుపక్కల గ్రామాల రైతులకు అవగాహన కలిగిస్తోంది. ఎండిన ఆకులతో, మగ్గబెట్టిన చెత్తాచెదారం, పండ్లు, కూరగాయల వ్యర్థాలతో ఎరువులు, యూరియా వంటివి తయారు చేస్తూ రసాయనాల వాడకం లేకుండానే అధిక దిగుబడులు సాధిస్తోంది. నామమాత్రపు ధర... మామిడి, చెరకు, నిమ్మ, జామ, సపోట, నేరేడు, ఉసిరి, పనస, చీనీ.. పండ్ల తోటల సాగుతోపాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. వీటిని తన చుట్టుపక్కల వారికి ఇవ్వడంతో పాటు మిగతా వారికి నామమాత్రపు ధరలతో అందిస్తున్నారు. అందరికీ ఇవ్వగా మిగిలిన ఉత్పత్తులను రాజంపేట పాత బస్‌స్టాండు వద్ద షాపును ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా అందజేయడంతో పాటు మిగతా ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తోంది. అందరి ఆరోగ్యం ఈ కంప్యూటర్ యుగంలో ఎక్కడ చూసినా కల్తీ సరుకులే. వీటితో ఎంతోమంది అనారోగ్యం బారిన పడటం చూస్తున్నాను. రసాయనాలు లేని సేంద్రియ వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులను అందరూ ప్రోత్సహించాలి. అందుకే ఈ పనిని ఎంచుకున్నాను. ఎటువంటి లాభాలూ ఆశించకుండా నా చుట్టూ ఉన్నవారికి సేంద్రియ ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. – శవన హైమావతి పురస్కారాల పంట... ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న హైమావతిని ప్రతి యేటా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది మహిళా దినోత్సవ సందర్భంగా మాతృభూమి ఫౌండేషన్ నుంచి తెలంగాణ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా హైమావతికి అవార్డును ప్రదానం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతిది క్షుణ్ణంగా తెలుసుకుంటూ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న హైమావతికి అభినందనలు చెబుదామా!- – బసిరెడ్డి వెంకట నాగిరెడ్డి, సాక్షి, అన్నమయ్యజిల్లా చదవండి: Sagubadi: మూడు చక్రాల బుల్లెట్ బండి! లీటర్ డీజిల్‌తో ఎకరం దున్నుకోవచ్చు! -
మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా
-
దిగ్గజ తెలుగు నటుడి భార్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : అలనాటి మేటి నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు సతీమణి హైమావతి(87) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో నివాసం ఉంటున్న ఆమె ఈ మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించారు. హైమావతి మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, 1951లో వచ్చిన నిర్ధోషి సినిమాతో చలన చిత్ర రంగంలోకి ప్రవేశించారు కాంతారావు. కత్తి ఫైట్లకు ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించి భంగపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయారు. 2003లో ఆయన చివరి సినిమా కబీర్దాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధితో మరణించారు. -
దిశ చట్టం మహిళలందరికీ ఆయుధం
-
మహిళలకు ఆయుధం లాంటిది
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఏపీ దిశ చట్టం’ మహిళలందరికీ ఆయుధం లాంటిదని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్ పర్సన్ హైమవతి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దిశ చట్టం తీసుకొచ్చి రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షణ కల్పించారని ప్రశంసించారు. మహిళలపై నేరాలు చేయాలనుకునే వారికి భయం కలిగేలా చట్టం రూపొందించారని కొనియాడారు. దిశ చట్టాన్ని దేశం మొత్తం తీసుకురావాలని కోరారు. 21 రోజుల్లోనే దోషులకు శిక్షలు పడేలా ఏపీ ప్రభుత్వం చట్టం తీసుకురావడం అభినందనీయం అన్నారు. గతంలో సరైన చట్టాలు లేనందువల్లే నిర్భయ, ఆయేషా మీరా కేసుల్లో దోషులకు ఇప్పటికీ శిక్షలు పడలేదన్నారు. కాగా, మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఏపీ దిశ చట్టం-2019’ కు గత శుక్రవారం శాసస సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్ కేసుపై జడ్జిమెంట్ వస్తుంది. -
ఆ మృగాన్ని శిక్షిస్తేనే వారి ఆత్మకు శాంతి
హైదరాబాద్ : ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది మొదలు..తిరిగి ఇంటికొచ్చే దాకా.. గంట గంటకు ఫోన్ చేసేవారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు... ..అమ్మా వేళకు బస్సు దొరికిందా? నువ్వు క్షేమంగా ఆఫీసుకు చేరుకున్నావా....జాగ్రత్తగా వెళ్లు..భోజనం చేశావా.. .ఇంటికొచ్చేటప్పుడు జాగ్రత్త అంటూ నా కన్నతల్లిలా నా బిడ్డలు నన్ను ఫోన్లో పలకరించేవారు. వాళ్లు చదువుల సరస్వతులు. నేను ఎన్ని కష్టాలొచ్చినాసరే వారిని బాగా చదివించాలనుకున్నాను. నా బంగారు తల్లుల కలలు నిజం చేయాలనుకున్నాను. కానీ వాడు నా ఇద్దరు బిడ్డలను దారుణంగా చంపేశాడు....దుఖఃతో హైమావతి గొంతు జీరబోయింది. ఉన్మాది ఘాతుకానికి తన ఇద్దరు కూతుళ్లను కోల్పోయి వారం గడిచినా ఆమె ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. నిత్యం యామినీ సరస్వతి,శ్రీలేఖలతో ఆనందంగా గడిపే ఆ తల్లి ఇపుడు బతికున్న శవంలా కాలం వెళ్లదీస్తోంది. ఇటీవల ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రేమోన్మాది అమిత్‌సింగ్ అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన ఆ తల్లి మాత్రం పుట్టెడు దుఖఃతో తల్లడిల్లుతోంది. తన కంటికి రెప్పలా కాపాడుకున్న ఇద్దరు కూతుళ్లను కోల్పోవడంతో వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయి ధీనంగా చూస్తోంది. కోటి ఆశలు పెట్టుకొని గారాబంగా పెంచుకున్న తన ఇద్దరు కూతుళ్లను కోల్పోయి మౌనంగా రోదిస్తోంది. అత్యంత దారుణం.. హైమావతి కూతుళ్లు యామినీ సరస్వతి(22), శ్రీలేఖ(21)లను ఈనెల 14న ఉదయం 8.30 గంటలకు కొత్తపేట్‌లో వారు అద్దెకుంటున్న ఇంట్లోనే అమిత్‌సింగ్ అనే ఉన్మాది పాశవికంగా చంపి పారిపోయాడు. ఈ జంట హత్యలు జరిగి మంగళవారానికి సరిగ్గా వారమైన నిందితుడి ఆచూకీ మాత్రం ఇంకా చిక్కలేదు. కనీసం పుట్టెడు శోకంలో ఉన్న హతురాళ్ల తల్లిని ఓదార్చే విషయంలో సర్కారు పెద్దలకు మనసు రాలేదు. నిందితున్ని గంటల్లో పట్టుకుంటామని హత్య జరిగిన రోజు హడావుడి చేసిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం వారి దుఖాఃన్ని మరింత పెంచుతోంది. హస్తినాపురం(వనస్థలిపురం)లో నివాసం ఉంటున్న ఆమె సోదరుడు చౌదరిరెడ్డి ఇంట్లో తలదాచుకున్న హైమావతిని మంగళవారం 'సాక్షి' ప్రతినిధి పలకరించగా..ఆ తల్లి కన్నీళ్ల పర్యంతమైంది. కూతుళ్లే నాకు సర్వస్వం.. ఇరవై రెండేళ్లుగా నా కూతుళ్లే నాకు సర్వస్వం. వారి కోసమే నేను బతుకుతున్నా. ఇద్దరూ చదువుల్లో సరస్వతీ పుత్రులే. పెద్దమ్మాయి యామిని(22)ఇంజినీరింగ్ పూర్తిచేసింది. చదువులో ఎప్పుడూ టాప్ ర్యాంకరే. షాద్‌నగర్‌లో చదువుకున్నప్పుడు ఎస్సెస్సీలో టాపర్‌గా నిలిచింది. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తిచేసింది. బ్యాంకు పీఓ పోస్టు పరీక్షకు సన్నద్ధమౌతోంది. వారి ఉన్నత చదువుల కోసమే ఏడాది క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగం సాధించడమే యామిని ధ్యేయం. చిన్నమ్మాయి శ్రీలేఖ(21) చేవెళ్లలోని సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఈమె కూడా చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకరే. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్నది ఆమెలక్ష్యం. ఇన్నేళ్లుగా నేను వారి కోసమే బతుకుతున్నా. వారి బంగారు భవిష్యత్ కోసమే కష్టపడుతున్నా. అప్పుడప్పుడూ నేను వారితో గడపాలని కోరితే వెంటనే ఉద్యోగానికి సెలవు పెట్టేదాన్నని హైమావతి జీరబోయిన గొంతుతో చెప్పింది. పరామర్శకు కూడా నోచుకోలేదు... ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన నన్ను హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు లకా్ష్మరెడ్డి,జూపల్లి కృష్ణారావులు కనీసం పరామర్శించలేదు. అమిత్‌సింగ్ తప్పించుకు తిరుగుతున్నా వాడిని వారం రోజులుగా పోలీసులు పట్టుకోలేకపోయారు. నా కూతుళ్లను పాశవికంగా చంపేసిన ఆ మృగాన్ని కఠినంగా శిక్షిస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. భవిష్యత్‌లో ఆడపిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఇలాంటి మృగాలను సమాజంలో బతకనీయకూడదు. మరొకరికి చూపునిచ్చిన అక్కాచెల్లెళ్లు... హత్యకు గురైన యామినీ సరస్వతి, శ్రీలేఖల నేత్రాలను ఎల్వీప్రసాద్ ఐ ఇన్సిట్యూట్‌కు దానం చేశారు. మరణించినా ఆ ఇద్దరు సరస్వతులు ఇంకొకరి జీవితాల్లో వెలుగులు నింపడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తల్లి హైమావతి అంగీకారం మేరకే ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో వారి నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్ నిపుణులు సేకరించారు. నా చేతులతో పెంచా... చిన్నప్పటి నుంచి నేను ఆ ఇద్దరమ్మాయిలతోనే ఉంటూ వారి ఆలనా పాలనా చూస్తూ నా చేతులతోనే అల్లారుముద్దుగా పెంచా. హత్య జరిగిన రోజు నేను ఇంట్లో ఉండి ఉంటే నా ప్రాణం అడ్డుపెట్టి మరీ ఆ పిల్లలను దక్కించుకునే దాన్ని. ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాలి. - నారమ్మ, హతురాళ్ల అమ్మమ్మ -
‘లిమ్కా బుక్’లో నారాయణ వైద్యురాలు
-
‘లిమ్కా బుక్’లో నారాయణ వైద్యురాలు
నెల్లూరు: నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన మరుగుజ్జు మహిళ కామాక్షి (ఎత్తు 108 సెంటీమీటర్లు)కి తమ ఆస్పత్రిలో డాక్టర్ కలికి హైమావతి విజయవంతంగా కాన్పు చేశారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ సుబ్రమణ్యం చెప్పారు. ఇందుకుగాను డాక్టర్ హైమావతికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించిందని తెలిపారు. నారాయణ వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమెను హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజ్ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా డా.హైమావతి మాట్లాడుతూ మరుగుజ్జు మహిళల గర్భసంచి చిన్నగా ఉండటంతో వారు గర్భం దాల్చడం అరుదుగా జరుగుతుందన్నారు.