ప్రముఖ సిమెంట్ కంపెనీలలో ఒకటైన జేకే సిమెంట్స్ (JK Cements) ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కేవలం ఒకేరోజులో రాజస్థాన్‌లోని 249 పాఠశాలల్లో 249 ర్యాంప్‌లను నిర్మించడం వల్ల ఈ ఘనత దగ్గింది.
రండి ప్రతీ మార్గాన్ని సులభతరం చేద్దాం (Banaye Har Raah Aasaan)’ అనే కార్యక్రమం ద్వారా జేకే సిమెంట్స్ 249 ర్యాంప్‌లను నిర్మించింది. ఇందులో సంస్థ ఉద్యోగులు, డీలర్స్, కాంట్రాక్టర్లు, కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ హెడ్ లవ్ రాఘవ్ తెలిపారు.
ఈ సందర్భంగా రాఘవ్ మాట్లాడుతూ.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజానికి మనవంతు తప్పనిసరిగా సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంగా ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే అని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
(ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..)
రాజస్థాన్‌లో నిర్మించిన 249 ర్యాంప్‌లు జేకే సిమెంట్స్ నిర్వహించింది. ఇందులో ఇతర సంస్థలు, ప్రభుత్వ విభాగాల జోక్యం లేదని కూడా ఈ సందర్భంగా జేకే సిమెంట్స్ క్లస్టర్ హెడ్ హరీశ్ ఖుషలని తెలిపారు. సుమారు రెండు వేలమంది కార్మికుల సహకారంతో ఇది విజయవంతమైందని కూడా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment