JK Cement
-
JK Cements: ఇది కదా రికార్డ్ అంటే..
ప్రముఖ సిమెంట్ కంపెనీలలో ఒకటైన జేకే సిమెంట్స్ (JK Cements) ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కేవలం ఒకేరోజులో రాజస్థాన్‌లోని 249 పాఠశాలల్లో 249 ర్యాంప్‌లను నిర్మించడం వల్ల ఈ ఘనత దగ్గింది. రండి ప్రతీ మార్గాన్ని సులభతరం చేద్దాం (Banaye Har Raah Aasaan)’ అనే కార్యక్రమం ద్వారా జేకే సిమెంట్స్ 249 ర్యాంప్‌లను నిర్మించింది. ఇందులో సంస్థ ఉద్యోగులు, డీలర్స్, కాంట్రాక్టర్లు, కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ హెడ్ లవ్ రాఘవ్ తెలిపారు. ఈ సందర్భంగా రాఘవ్ మాట్లాడుతూ.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజానికి మనవంతు తప్పనిసరిగా సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంగా ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే అని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..) రాజస్థాన్‌లో నిర్మించిన 249 ర్యాంప్‌లు జేకే సిమెంట్స్ నిర్వహించింది. ఇందులో ఇతర సంస్థలు, ప్రభుత్వ విభాగాల జోక్యం లేదని కూడా ఈ సందర్భంగా జేకే సిమెంట్స్ క్లస్టర్ హెడ్ హరీశ్ ఖుషలని తెలిపారు. సుమారు రెండు వేలమంది కార్మికుల సహకారంతో ఇది విజయవంతమైందని కూడా వెల్లడించారు. -
లక్ష్మీవిలాస్ బ్యాంక్- జేకే సిమెంట్ జోరు
ఆర్బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 307 పాయింట్లు జంప్‌చేసి 40,450ను తాకింది. కాగా.. పీఈ సంస్థ క్లిక్స్ గ్రూప్ నుంచి నాన్‌బైండింగ్ ఆఫర్ వచ్చిన వార్తలతో ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. మరోవైపు గుజరాత్ ప్లాంటు నుంచి సిమెంట్ విక్రయాలు ప్రారంభమైనట్లు వెల్లడించడంతో జేకే సిమెంట్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. లక్ష్మీ విలాస్ బ్యాంక్ పీఈ సంస్థ క్లిక్స్ గ్రూప్ నుంచి విలీనానికి సంబంధించి నాన్‌బైండింగ్ ఆఫర్ లభించినట్లు లక్ష్మీ విలాస్ బ్యాంక్ పేర్కొంది. క్లిక్స్ గ్రూప్‌నకు చెందిన క్యాపిటల్ సర్వీసెస్, క్లిక్స్ ఫైనాన్స్ ఇండియా, క్లిక్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లను లక్ష్మీ విలాస్ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు నాన్‌బైండింగ్ ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లింది. రూ. 19.4 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం జంప్‌చేసి రూ. 20.70 వరకూ ఎగసింది. జేకే సిమెంట్ లిమిటెడ్ గుజరాత్‌లోని బాలసినోర్‌లో ఏర్పాటు చేసిన 0.7 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభించినట్లు జేకే సిమెంట్ పేర్కొంది. వాణిజ్య ప్రాతిపదికన వీటి డిస్పాచెస్ సైతం ప్రారంభించినట్లు తెలియజేసింది. దీంతో రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ యూనిట్లతో కలిపి మొత్తం గ్రే సిమెంట్ సామర్థ్యం 4.2 మిలియన్ టన్నులకు చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జేకే సిమెంట్ షేరు తొలుత 4.5 శాతం జంప్‌చేసి రూ. 1,660ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.2 శాతం లాభంతో రూ. 1,638 వద్ద ట్రేడవుతోంది. -
జేకే సిమెంట్ లాభాలు జూమ్
ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి దారు జేకే సిమెంట్ లాభాల్లో దూసుకుపోయింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ 60.85 కోట్ల స్వతంత్ర నికరలాభాలను ఆర్జించినట్టు శనివారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ 1.05 కోట్లతో పోలిస్తే గణనీయనమైన లాభాలను ఆర్జించింది. కంపెనీ నికర అమ్మకాలు 886,70 కోట్లకు పెరిగాయని జేకే సిమెంట్ లిమిటెడ్ బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది.గత ఏడాది ఇదే కాలంలో రూ 812,09 కోట్ల రూపాయలు గా ఉంది. జేకే సిమెంట్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం వైట్ సిమెంట్ 6,00,000 టన్నుల, 7,00,000 టన్నుల వాల్ పుట్టి వార్షిక సామర్ధ్యాన్ని కలిగి వుంది.