18 గంటల్లో గోపుర నిర్మాణం
నంద్యాల: స్ఫటికలింగ శివాలయం గోపుర నిర్మాణాన్ని 18 గంటల్లో పూర్తిచేసి శిల్పులు రికార్డు నెలకొల్పారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎన్‌జీవో కాలనీ హౌసింగ్ బోర్డులో అమరయోగ వికాస కేంద్ర ఆవరణలో యోగాచార్య పాములేటి స్వామి స్ఫటిక లింగంతో శివాలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయాన్ని మొత్తం 48 గంటల్లో పూర్తిచేయాలని శిల్పి అన్నయ్య ఆచారి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పదిరోజుల కిందట 12 గంటల్లో స్ఫటికలింగ శివాలయాన్ని పూర్తిచేశారు.
శుక్ర, శనివారాల్లో గోపుర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయంపై 12 అడుగుల ఎత్తు గోపుర నిర్మాణ పనుల్ని శుక్రవారం 12 గంటలు, శనివారం ఆరుగంటలు పనిచేసి పూర్తిచేశారు. మొత్తం 18 గంటల్లో గోపుర నిర్మాణం పూర్తిచేసి రికార్డు నెలకొల్పామని శిల్పి అన్నయ్య ఆచారి పేర్కొన్నారు.