
ఆ కళ్లంటే చాలా ఇష్టం : ప్రభాస్
సూర్య తన కళ్లతోనే హావభావాలు పలికిస్తారు. ఆయన కళ్లంటే చాలా ఇష్టం. జ్ఞానవేల్ రాజా, సూర్య,
‘‘సూర్య తన కళ్లతోనే హావభావాలు పలికిస్తారు. ఆయన కళ్లంటే చాలా ఇష్టం. జ్ఞానవేల్ రాజా, సూర్య, వెంకట్ ప్రభు కలయికలోని ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని హీరో ప్రభాస్ అన్నారు. సూర్య హీరోగా కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో తె రకెక్కిన తమిళ చిత్రం ‘మాస్’ను తెలుగులో ‘రాక్షసుడు’గా కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి అందిస్తున్నారు. నయనతార, ప్రణీత నాయికలు.
యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని ముఖ్య అతిథి ప్రభాస్ ఆవిష్కరించారు. సూర్య మాట్లాడుతూ -‘‘చిరంజీవి గారి ‘రాక్షసుడు’ టైటిల్ పెట్టుకోవడం ఆనందంగా ఉంది. ప్రభాస్ ‘బాహుబలి’ గురించి తమిళనాట అంతా ఎదురుచూస్తున్నారు’’ అన్నారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుందని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో దర్శకుడు కోదండరామిరెడ్డి, కాశీవిశ్వనాథ్, బన్నీ వాసు పాల్గొన్నారు.