Actor Suriya Reveals About His Memorable Incident Which Happened With Prabhas, Deets Inside - Sakshi
Sakshi News home page

Suriya: ప్రభాస్‌కు సారీ చెబుదామనుకున్నా.. కానీ అది చూసి షాకయ్యాను

Published Wed, Nov 30 2022 1:45 PM | Last Updated on Wed, Nov 30 2022 3:17 PM

Suriya Opens Up On his Bond With Prabhas - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మంచి భోజన ప్రియుడు అనే విషయం అందరికి తెలిసిందే. కొత్త కొత్త రుచులను ఆస్వాదించడం ఆయనకు అలవాటు. షూటింగ్‌ సమయంలో కూడా యూనిట్‌ మొత్తానికి తరచూ ఇంటి నుంచి భోజనం తెప్పిస్తుంటాడు. ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి సహ నటీనటులందరూ తరచూ చెబుతుంటారు. దీపికా పదుకొణె మొదలు అమితాబ్‌ వరకు చాలా మంది స్టార్స్‌  ప్రభాస్‌ ఆతిథ్యంపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా తమిళ్‌ స్టార్‌ సూర్య కూడా ప్రభాస్‌ ఆతిథ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్‌ తనకోసం చేయించిన బిర్యాని అద్భుతంగా ఉందని, జీవితంలో అంత టేస్టీ బిర్యాని తినలేదని చెప్పుకొచ్చాడు. తాజాగా సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఒకసారి షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లాను. విషయం తెలుసుకున్న ప్రభాస్‌.. నన్ను డిన్నర్‌కి ఆహ్వానించగా.. సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పాను.

కానీ నా షూట్‌ పూర్తయ్యేసరికి రాత్రి 11 అయ్యింది. దాంతో టైమ్ అయిపోయింది ఇక డిన్నర్ కుదరదనుకుని.. ప్రభాస్‌కు సారీ చెబుదామనుకున్నా. రాత్రి 11.30గంటలకు హోటల్‌లో ప్రభాస్‌ని కలిశాను.  షాకింగ్ ఏంటీ అంటే  నా రూమ్‌కి వచ్చిన ప్రభాస్‌..‘ మీ కోసమే వెయిట్‌ చేస్తున్నా సర్‌..బిర్యానీ రెడీగా ఉంది. త్వరగా వచ్చేయండి ’అని అన్నారు. అయితే అది హోటల్‌ లేదా ప్రొడక్షన్‌ హౌస్‌ మెస్‌ నుంచో తెప్పించారేమో అనుకున్నా. కానీ వాళ్ల ఇంటి నుంచి అమ్మ చేసిన భోజనాన్ని తెప్పించాడు. నేను వచ్చే వరకు ప్రభాస్‌ తినకుండా నా కోసం ఎదురు చూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీని ఎప్పుడూ తినలేదు’ అని సూర్య చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement