
కౌగిలింతతో కనుచూపు!
వాటికన్ సిటీ: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పోప్ ఫ్రాన్సిస్ కౌగిలించుకోవడంతో చూపు మందగించిన బాలికకు మామూలు చూపు వచ్చింది. ఓహియోకి చెందిన ఐదేళ్ల బాలిక లిజ్జీ మైయర్స్ జెనెటిక్ సమస్యతో కారణంగా క్రమంగా తన కంటి చూపును కోల్పోతోంది. దీంతో లిజ్జీ కుటుంబ సభ్యులు ఆమెను పోప్ వద్దకు తీసుకుని వచ్చారు. పోప్ స్వయంగా పాపను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్న తర్వాత చేతులతో ఆమె కళ్లను తడిమారు. అంతే ఆ చిన్నారి ఇప్పుడు మామూలుగా చూడగలుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించారు.
అంతేకాదు తాను ఉషెర్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియని లిజ్జీ పోప్కు ఒక బొమ్మను కూడా బహుమతిగా ఇచ్చింది. ఒక్క సారిగా మామూలు దృష్టి రావడంతో లిజ్జీ ఆశ్చర్యానికి గురైందట. ఆమె దూరం నుంచి వస్తువులను చూపించి గుర్తుపడుతుండటంతో కూతురుకు చూపు వచ్చినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.