రోమ్: అద్దె గర్భాలతో మాతృత్వం పొందడం అనేది సంప్రదాయబద్ధం కాదని, ఇలాంటి అనైతిక విధానాన్ని ప్రపంచమంతటా నిషేధించాలని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆధునిక యుగంలో గర్భం, మాతృత్వం కూడా వ్యాపారమయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అద్దెగర్భం అనేది మహిళల గౌరవాన్ని కించపర్చడమే అవుతుందని అన్నారు. ఆయన సోమవారం వాటికన్ సిటీలో వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం గురించి ప్రస్తావించారు.
ప్రపంచంలో శాంతియుత పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయని, శాంతికి, మానవత్వానికి విఘాతం కలుగుతోందని చెప్పారు. ఈ పరిణామం ఎంతమాత్రం క్షేమకరం కాదని అన్నారు. కొన్ని దేశాల్లో సంక్షోభాలు, ఫలితంగా వలసలు పెరిగిపోతుండడం, వాతావరణ మార్పులతో ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతుండడం పట్ల పోప్ ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాల ఉత్పత్తి పెచ్చరిల్లుతుండ డం భూగోళంపై మానవాళికి మనుగడకు ఎప్పటికైనా ముప్పేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment