అమెజాన్‌ చేతికి బిగ్‌ బాస్కెట్‌? | Amazon eyes BigBasket to tap into India's online grocery space | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ చేతికి బిగ్‌ బాస్కెట్‌?

Published Thu, Jun 15 2017 9:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

అమెజాన్‌ చేతికి బిగ్‌ బాస్కెట్‌?

అమెజాన్‌ చేతికి బిగ్‌ బాస్కెట్‌?


ముంబై: ఈ-కామర్స్‌ దిగ్గజం  అమెజాన్‌ ఇండియా  భారత్‌లో మరింత విస్తరణ పథకాలను అమలు చేయనుంది. ముఖ్యంగా  ఇండియాలో ఆన్ లైన్ మార్కెటింగ్  మరింతగా పెంచుకోవాలని యోచిస్తున్న  అమెజాన్‌ ఆన్‌లైన్‌ కిరాణా వెబ్‌సైట్‌ బిగ్‌బాస్కెట్‌.కామ్‌ను చేజిక్కించుకోవాలని యోచిస్తోంది. తాజా  నివేదికల ప్రకారం ఈ కొనుగోలుకు సంబంధించిన చర్చలు చాలా ప్రాథమిక స్థాయిలో కొనసాగుతున్నట్టు  తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వ్యక్తులను ఉటంకిస్తూ మీడియాలో కథనలు వెలువడుతున్నాయి. అమెజాన్ తన మార్కెట్ వాటాను ఏకీకృతం చేసే కృషిలో భాగంగా  బిగ్‌ బాస్కెట్‌పై కన్నేసినట్టు తెలుస్తోంది.    

అమెజాన్ ఆన్లైన్ లో ఆహారాన్ని, కిరాణా అమ్మకాలపై  యోచిస్తోంది. ఈ మేరకు దాని ఉత్పత్తిలో ఆఫర్లను పెంచుతుంది. ఈ రిటైల్ ట్రేడింగ్ లైసెన్స్ కోసం భారత ప్రభుత్వాన్ని కోరింది. దాదాపు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ పథకాన్ని త్వరలో మంజూరు చేయనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్లో పేర్కొంది.

అయితే అమెజాన్ ఆసక్తి చూపినప్పటికీ, బిగ్బాస్కెట్ విక్రయానికి అంగీకరించకపోవచ్చని  అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే  బిగ్‌ బాస్కెట్‌  ఇప్పటికే గత ఏడాది $ 150 మిలియన్ డాలర్లను నిధులను పొందింది. దీంతోపాటు ఈ ఏడాది మార్చ్ నెలలో వారు తిరిగి రూ. వడ్డీ రుణంలో 45 కోట్ల డెలివరీ నెట్‌వర్క్‌ను  పటిష్టం  చేసుంది. ఈక్రమంలో  కొత్త గిడ్డంగులను  ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్కెట్‌  ప్రతినిధి ఈ పుకార్లు నిజం కాదని  ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ వార్తలపై అమెజాన్ ప్రతినిధి నిరాకరించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement