
నాకు నేనే సాటి.. నాకెవరూ రారు పోటీ అంటోంది ఈ ఫొటోలో ఉన్నామె. పోటీ ఎందులో అంటారా? ఆమె కళ్లు చూశారా.. ఆ కంటి రెప్పలకున్న వెంట్రుకలు చూశారా..? అంతపెద్దగా ఉన్నాయేంటి అనుకుంటున్నారా? అవును ప్రపంచంలోకెల్లా అతి పొడవైన కనురెప్ప వెంట్రుకలు ఉన్న ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ విషయంలో 2016లోనే రికార్డు సృష్టించిన ఆమె.. ఇప్పుడా రికార్డును తనే బ్రేక్ చేసింది.
చైనాలోని చాంగ్‌జౌ నగరానికి చెందిన యూ జియాంజియా 2016లో 12.5 సెంటీమీటర్ల (4.88 అంగుళాలు) పొడవైన కనురెప్పల రోమాలతో రికార్డు సృష్టించింది. సీన్ కట్‌చేస్తే.. ఐదేళ్లలో అవి రెట్టింపు అయ్యాయి. ఎడమ కనురెప్ప వెంట్రుకలు ఏకంగా 20.5 సెంటీమీటర్ల (8 అంగుళాలు) పొడవు పెరిగాయి. దీనితో మరోసారి గిన్నిస్ బుక్‌లోకెక్కింది. తాను ఓసారి పర్వత ప్రాంతాల్లో ఏడాదిన్నర నివసించానని, అప్పుడే బుద్ధుడు పొడవైన వెంట్రుకలను బహుమానంగా ఇచ్చాడని ఆమె అంటోంది.
చదవండి: చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. తిమింగలం నోటిలో 30 సెకన్ల పాటు
Comments
Please login to add a commentAdd a comment